సొంత పార్టీలోనే రెబల్ ఎంపీగా ఉంటూ.. అధినేతపై నాన్ స్టాప్ గా ఘాటు విమర్శలు.. మంట పుట్టే వ్యాఖ్యలు చేసే రఘురామ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అధికారికంగా వైసీపీ ఎంపీగా ఉన్నప్పటికీ.. నిత్యం సొంత పార్టీ మీద విమర్శలు చేసే ఆయన తాజాగా ఒక చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన అంశాల్ని ప్రస్తావించారు. అందులో ముఖ్యమైనది.. ఆయన అరెస్టుకు కారణమైన కేసు వివరాల్ని వెల్లడించారు.
ఢిల్లీనుంచి హైదరాబాద్ కు వచ్చిన ఎంపీ రఘురామను ఏపీ పోలీసులు అరెస్టు చేయటం.. అనంతరం లాకప్ కు తరలించి.. ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఎంపీగా ఉన్న తనను దారుణంగా పోలీసులు చితక్కొట్టేశారన్న రఘురామ.. అప్పట్లో నడవలేక వీల్ ఛైర్ కే పరిమితం కావటం తెలిసిందే. తనను లాకప్ లో ఉన్న వేళ చితక్కొడుతుంటే.. సదరు అధికారి తన పై వ్యక్తికి చూపించినట్లుగా పేర్కొన్నారు. ఇంతకూ ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని రివీల్ చేయని రఘురామ.. ‘పై వాడంటే పైవాడే. ఆర్తనాదాలను చూసి ఆ పైవాడు ఆనందించాడు’ అని పేర్కొన్నారు.
ఇంతకీ ఎంపీ రఘురామ అరెస్టుకు కారణమైన కేసు ఏమిటి? అన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇలాంటి కేసుకు కూడా అరెస్టు చేస్తారా? అన్న విస్మయం కలిగించేలా ఉన్న కేసు గురించి ఆయనేం చెప్పారంటే..
ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టు చేయొద్దన్న సుప్రీం కోర్టు తీర్పు ఉంది. ఆ ధైర్యంతోనే హైదరాబాద్ కు వచ్చాను. అదీ కాక అప్పటికే నాకు బెయిల్ వచ్చింది కూడా. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం నియోజకవర్గానికి వెళుతున్నానంటే.. సరిగ్గా ఆ సమయానికి ఏడు పోలీస్ స్టేషన్లలో ఒకే సమయానికి ఒకే నేరం మీద కేసులు పెట్టారు. అందులో ఆరుకేసులు ఒకే టైపు. మరొకటి వేరే.
ఆ కేసు ఏమిటంటే.. ‘‘ఎన్నికలలో నాకు డబ్బులు అవసరం అని నా మనిషి ఒకరు అడిగితే.. ఒక వ్యవసాయ కూలీ పెద్ద మనసుతో ఐదు లక్షలు అప్పు ఇచ్చాడట. అది కూడా నేనెవరో తెలియకుండా నా మనిషికి ఇచ్చారట. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని నా మనిషిని ఆ కూలి అడిగితే... నా మనిషి నాకు ఫోన్ చేసినప్పుడు నేను బూతులు మాట్లాడానట! అది ఆ కూలీ ఫోన్ స్పీకర్‌లో విన్నాడట! అది పక్కన వాళ్లు విన్నారట! అందుకని నాపై అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టారు’’ అని చెప్పారు. అలాంటి కేసు పెట్టి అరెస్టు చేసి.. చిత్రహింసలకు గురిచేశారని రఘురామ చెప్పారు.