వైఎస్సార్సీపీ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు, జగన్ ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత పొడసూపిన విభేదాలతో వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. అప్పటి నుంచి ఏకుకు మేకులా మారి జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైఎస్సార్సీపీ నేతల నుంచి అంతే ధీటుగా రఘురామపై కౌంటర్లు పడుతున్నాయి.
నిత్యం సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా సంస్థల ద్వారా జగన్ ప్రభుత్వంపై, ఏపీ రాజకీయాలపైన రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిత్యం 'రచ్చబండ' పేరుతో జగన్ ప్రభుత్వ విదానాలపై రఘురామ నిప్పులు చెరుగుతున్నారు.
తాజాగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రఘురామ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ, జనసేనకు తోడు మూడో పార్టీ కూడా ఈ రెండు పార్టీలతో జత కడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఓ ప్రభంజనమవుతుందని రఘురామ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలకు మూడో పార్టీ కూడా జత కలుస్తుందన్నారు. తద్వారా పరోక్షంగా బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో కలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అనంతరం తమ పార్టీ వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారని రఘురామ ఎద్దేవా చేశారు. అలాగే గతంలోనూ తమ పార్టీ నేతల ప్యాంట్లు తడిసిపోయాయని హాట్ కామెంట్స్ చేశారు.
ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు మూకుమ్మడిగా విమర్శలు దాడి చేశారు. ఈ విమర్శలను అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. తమ కలయికతో వైసీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలోనే ఎంపీ రఘురామకృష్ణరాజు సైతం వైసీపీ నేతల విమర్శలను ప్రస్తావించారు. పవన్, చంద్రబాబుల భేటీతో వైసీపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. టీడీపీ–జనసేన ప్రభంజనం ఖాయమని తెలిపారు.
కాగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని జనసేనాని పవన్ కల్యాణ్ నొక్కి వక్కాణిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అన్ని పార్టీలు కలసి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల పొత్తు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీని కూడా తమ కూటమిలోకి తీసుకురావాలని రెండు పార్టీలు యోచిస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం జనసేనతోనే తమకు పొత్తు అని.. మరే పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.