మునికోటి వైద్యానికి రూ.2లక్షలు ఇచ్చిన కాంగ్రెస్

Update: 2015-08-08 16:46 GMT
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరు సభలో.. ఏపీ ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తిరుపతికి చెందిన మునికోటి ఆత్మాహుతి ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలొ అతన్ని తిరుపతి నుంచి ఇప్పుడు.. (రాత్రి.. 7.30 గంటల సమయంలో) తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు.. అతని వైద్య సాయం కోసం.. ఖర్చుల కోసం రూ.2 లక్షల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి.. మునికోటి కుటుంబ సభ్యులకు చెక్కును అందచేసినట్లు ఏపీ కాంగ్రెస్ రథసారధి రఘువీరారెడ్డి ప్రకటించారు.

మరోవైపు మునికోటి ఆత్మాహుతి ప్రయత్నం చేయటానికి దారి తీసిన పరిస్థితులకు నిరసనగా.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదివారం నాడు ఏపీలోని 13 జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు రఘువీరా ప్రకటించారు. ఇక.. ఈ నెల 11న విద్యార్థి సంఘాలు.. ప్రజా సంఘాలు.. వామపక్షాలు ఇచ్చిన బంద్ నకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది.

అంతేకాదు.. ఈ నెల 13 లోపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో.. ఆ వెంటనే.. ఏపీలోని 1200 పోలీస్ స్టేషన్లలో ప్రధాని మోడీ.. కేంద్రమంత్రి వెంకయ్య.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులపై ఫిర్యాదులు చేస్తామని వెల్లడించారు. ఒక.. తీవ్రంగా గాయపడిన మునికోటి కుటుంబానికి ఏపీ సర్కారు రూ.25లక్షల రూపాయిలు ఇవ్వాలని రఘువీరా డిమాండ్ చేశారు.
Tags:    

Similar News