బిగ్‌బాస్‌- చిన్నబాస్‌లపై రఘువీరా ఆరోపణలివి!

Update: 2015-04-09 05:18 GMT
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకా చిన్నబాస్‌ హవా ఉందని అంటున్నాడు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును బిగ్‌బాస్‌గా, ఆయన తనయుడు లోకేష్‌ను చిన్నబాస్‌గా అభివర్ణిస్తూ  రఘువీరారెడ్డి ఆరోపణలు గుప్పించాడు. వారిద్దరికీ భారీ స్థాయిలో కమిషన్లు అందుతున్నాయని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించాడు.

    పారిశ్రామీకకరణ పేరుతో చిన్న పరిశ్రమయలకు రాయితీలు ప్రకటించడం విషయంలో చిన్న బాస్‌కు ఇప్పటికే 500 కోట్ల రూపాయల ముడుపులు అందాయని రఘువీరా ఆరోపించాడు. ఒకవైపు పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్టుగా చెప్పుకొంటూ.. మరోవైపు ఇలా దోపిడీ చేస్తున్నారని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించాడు.

    పట్టిసీమ ప్రాజెక్టుతో కూడా భారీ దోపిడికి ప్లాన్‌ చేశారని.. రఘువీరారెడ్డి ఆరోపించాడు. దీని ద్వారా ఐదొందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆయన అన్నాడు.

    ఇక మిగులు విద్యుత్‌ కోసం అంటూ కరెంటు భారీగా కొంటున్నారని.. దీంట్లో కూడా కమిషన్లే రాజ్యమేలుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్‌ తెలిపాడు. ఈ వ్యవహారంలో చిన్న బాస్‌కు ప్రతి యూనిట్‌ కరెంటు మీద కూడా పావలా కమిషన్‌ అందుతోందని రఘువీరా అంటున్నాడు.

    ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ బాబులను బిగ్‌బాస్‌, చిన్నబాస్‌ అంటూ రఘువీరారెడ్డి విమర్శిస్తూ వారు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు చేశాడు. మరి ఈ ఆరోపణల విషయంలో ఆయన వద్ద ఉన్న సాక్ష్యాలు ఏమిటో!
Tags:    

Similar News