ఏపీ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపిన అంశం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ప్రజలు స్వచ్చందంగా ఉద్యమించిన ఈ అంశంపై అటు టీడీపీ - ఇటు బీజేపీ కప్పదాట్లు వేశాయనే విమర్శలు బలంగా వచ్చాయి! ఎన్నికల సమయంలో చెప్పిన హోదా గొప్పతనం కాస్తా - కుర్చీలు ఎక్కిన తర్వాత తక్కువైపోవడం, ఇంకా గట్టిగా మాట్లాడితే విలువలేనిదైపోవడం ఆశ్చర్యమే! దానివెనకాల ఉన్న పరమార్ధం కుర్చీలెక్కినోళ్లకే ఎరుక. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బీజేపీ ఎందుకివ్వడంలేదో, టీడీపీ గట్టిగా ఎందుకు అడగడంలేదో చెబుతున్నారు రఘువీరా రెడ్డి.
ఏపీకి ఎన్నికల సమయంలో ప్రకటించింది - మేనిపెస్టోలో పెట్టింది - ప్రత్యేక హోదా తెచ్చే వ్యక్తిగా వెంకయ్య సన్మానాలు చేయించుకుంది ఎందుకనే విషయాలు కాసేపు పక్కనపెడితే హోదా కోసం అటు రాజ్యసభలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఉద్యమించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు కొత్త ప్రచారం మొదలుపెట్టింది. అదేమిటంటే... "కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుందనే కారణంతోనే హోదాను అమలు చేయకుండా టీడీపీ - బీజేపీ లు కుట్ర చేశాయని"! అంటే... "ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలోనే ప్రకటించింది కాబట్టి.. రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు బిల్లుపెట్టి మరీ పోరాడారు కాబట్టి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే పోరాటం చేసింది కాబట్టి.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన అన్ని పార్టీలకంటే కాంగ్రెస్ కే ఎక్కువ పేరు వస్తుందని బీజేపీ - టీడీపీ లు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనేది రఘువీరా మాటల్లోని పరమార్ధంగా చెప్పుకోవచ్చు!!
ఇదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం పాలనపై తనదైన శైలిలో విమర్శలు చేశారు రఘువీరా. అబద్ధాలతో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై దండయాత్ర చేస్తూ పాలన సాగిస్తోందని - దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా టీడీపీ - బీజేపీలు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్తకొత్త అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేవలం కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుందనే కారణంతోనే హోదాను అమలు చేయకుండా టీడీపీ-బీజేపీ కుట్ర చేశాయని రఘువీరా అన్నారు. ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధుల రెండ్రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించిన సందర్భంగా రఘువీరారెడ్డి ఈ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
ఇక పోలవరం ప్రాజెక్టులో ప్యాకేజీల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను వదులుకున్నారని - హోదా అమలు చేసేంతవరకు కాంగ్రెస్ రాజీ లేకుండా పోరాడుతుందని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చెబుతున్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను- పునర్విభజన చట్టంలోని అంశాలను కొత్త ప్యాకేజీగా చెప్పడం బీజేపీ - టీడీపీలు ఏపీ ప్రజలను చేస్తున్న పచ్చిమోసంగా ఆయన అభివర్ణించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/