అధికార తెలుగుదేశం పార్టీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. గత రెండున్నరేళ్లుగా పూర్తయినప్పటికీ పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీ - కార్పొరేట్ ఎన్నికలు నిర్వహించడానికి టీడీపీ ఎందుకు భయపడుతోందని రఘవీరారెడ్డిప్రశ్నించారు. తమ పాలన అద్భుతమని ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు - ఆయన మంత్రివర్గ సహచరులు - నేతలు ఎన్నికల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీశారు. ప్రజల్లో ప్రభుత్వం అంటే ఎంత వ్యతిరేకత ఉందో టీడీపీ నేతలకు సైతం తెలుసునని వ్యాఖ్యానించారు. వెనుకబాటు తనాన్ని రూపుమాపకుండా ప్రాంతాల మధ్య వివక్ష చూపితే రాష్ట్రాల్లో వేర్పాటు వాదం మొదలవుతుందని రఘువీరారెడ్డి హెచ్చరించారు.
విశాఖ పోర్టు స్టేడియంలో ఉత్తరాంధ్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేయకపోవడం వల్లే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దారి తీసిందని అన్నారు. తద్వారా సీమాంధ్రులు ఇబ్బందుల పాలవడం - రాష్ట్రం విడిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని విశ్లేషించారు. అయితే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఏపీ సీఎం చంద్రబాబు అదే రీతిలో ముందుకు సాగుతున్నారని రఘువీరా రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ అదే పంధాతో రాయలసీమ - ఉత్తరాంధ్ర ప్రాంతాలను విస్మరించి - అమరావతి చుట్టూ తిరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర - రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి పేరిట రూ.24,350 కోట్లు కేటాయించాలని విభజన చట్టంలో కాంగ్రెస్ స్పష్టంగా పేర్కొందని రఘువీరా రెడ్డి అన్నారు. అయితే బీజేపీ అధికారం చేపట్టిన అనంతరం వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి నిధుల మంజూరులో వివక్ష చూపిందని ఆరోపించారు. ఒక్కో జిల్లాకు ఏడాదికి కేవలం రూ.50 కోట్లను మాత్రమే కేటాయించడం ద్వారా ఈ ప్రాంతాలపై వివక్ష చూపడం ప్రమాదకరమని రఘువీరా రెడ్డి అన్నారు. ఈ వివక్ష భవిష్యత్ లో ప్రత్యేక ఉద్యమాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు ఆలోచన దోరణితో మరో ప్రత్యేక రాష్ట్ర విభజనకు ఉద్యమ బాట పట్టకుండా చూడాలని హితవు పలికారు. ప్రత్యేక హోదా - రైల్వేజోన్ కోసం నిరంతరం పోరాటం చేయాలని కార్యకర్తలను రఘువీరా రెడ్డి కోరారు.
కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి - రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు రామచంద్ర కుంతియా మాట్లాడుతూ ఈ దేశాన్ని సమర్ధవంతంగా పాలించే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. గత ఎన్నికల్లో ఓటమి ఒక గుణపాఠంగా - వచ్చే ఎన్నికల్లో విజయానికి క్షేత్ర స్థాయి నుంచి పనిచేయాలని హితవు పలికారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/