ఓటుకు నోటు విషయంలో టీ ఏసీబీ తయారు చేసిన ఛార్జిషీట్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించటం రాజకీయ దుమారంగా మారింది. ఛార్జిషీట్‌లో ఏపీ సీఎం పేరును అవకాశం ఉన్న ప్రతిచోటా ప్రస్తావించిన టీ ఏసీబీ శ్రమకు ఫలితం దక్కుతోంది.
ఇంతకాలం ఓటుకు నోటు ఇష్యూ మీద ఏపీ సీఎం చంద్రబాబు మీద సమర్థంగా దాడి చేయలేని విపక్షాలకు.. టీ ఏసీబీ రూపొందించిన ఛార్జీషీట్ కొత్త ఉత్సాహాన్ని.. శక్తినిస్తోంది.
తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్..కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో బాబు పాత్రను ప్రశ్నిస్తూ పలు సందేహాల్ని సంధిస్తున్నారు. తాజా అంశాల మీద ధ్వజమెత్తిన నేతల్లో.. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బొత్స సత్తిబాబు విమర్శ అర్థవంతంగా ఉండటంతో పాటు.. అందరిని ఆకర్షించేలా ఉంది. ఛార్జీషీట్ లో 22 సార్లు ఒకరి పేరును ప్రస్తావిస్తే.. అది చంద్రబాబు కాకుండా.. ఒక సామాన్యుడి పేరే ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. బాబు ప్లేస్ లో సామాన్యుడి ఉండి ఉంటే విచారణ సంస్థలు ఎలా వ్యవహరించేవని ఆయన నిలదీస్తున్నారు. అందుకే.. చంద్రబాబు పేరును ఏ1గా చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు నోటు ఉదంతంలో బాబు పేరును టీ ఏసీబీ తన చార్జిషీట్ లో 22 సార్లు ప్రస్తావించటం అంటే.. ఆ వ్యవహారంలో ఆయన పాత్ర ఏమిటన్నది అర్థమవుతుందని.. ఇలాంటి నేపథ్యంలో విచారణ సక్రమంగా సాగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.
ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టంలో కూరుకుపోయిన బాబు.. ఏపీ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీని ఎలా నిలదీయగలరంటూ కొత్త సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానితో లాలూచీ పడిపోయి.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడతారని.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆయన ప్రధానిని నిలదీసే అవకాశం లేదన్న అనుమానాలు వ్యక్తం చేశారు.