ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మరోమారు తనదైన శైలిలో అధికార పార్టీపై మండిపడ్డారు. అబద్దాల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. మోసకారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... మధ్యలో వారధిలా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కలిసి ఆంధ్రప్రదేశ్ ను ముంచుతున్నారని విమర్శించారు. పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో జరిగిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభ గురించి ప్రస్తావిస్తూ అబద్ధాలు చెప్పిపోవడానికే అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారని అన్నారు. గతంలో కూడా రాజమండ్రికి వచ్చి రాష్ట్రానికి లక్ష 40వేల కోట్ల రూపాయల సాయం చేసామని లిస్టు చదివి వెళ్లారని చెప్పారు. ఆయన లిస్టును ఆయన భాగస్వామి టీడీపీ అధినేత చంద్రబాబే తప్పుబట్టారని రఘువీరా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చదువు లేనివారనో, లేక అవగాహన లేనివారనో ఆయన భావిస్తున్నారో ఏమో తెలియదన్నారు.
రైతు సదస్సు పేరిట తాజాగా మరికొన్ని కొత్త అబద్దాలను అమిత్ షా మోసుకువచ్చాడని రఘువీరా రెడ్డి విమర్శించారు. వీటిలో ప్రధానంగా రైతులకు మోడీ ప్రభుత్వం చాలా న్యాయం చేసిందని, ప్రత్యేక హోదా కన్నా ఎక్కువే సాయం చేస్తున్నామని అన్నారు. వాస్తవానికి నరేంద్రమోడీ ప్రభుత్వం దేశంలోని రైతాంగాన్ని తీవ్ర అన్యాయానికి గురి చేసిందన్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు 50 మద్దతు ధర పెంచుతామన్నదానికి ఇంతవరకు సమాధానం లేదని విమర్శించారు. అలాగే డా స్వామినాథన్ కమిషన్ నివేదకను అమలు చేస్తామని చెప్పినదానికీ ఇంతవరకు అతీగతీ లేదని తూర్పారబట్టారు. రైతాంగానికి అనుకూలంగా 2013 భూసేకరణ చట్టం చేస్తే దాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా ఆర్డినెన్స్ ద్వారా మార్చాలనుకున్నారని రఘువీరా రెడ్డి మండిపడ్డారు. మోడీ 30 నెలల పాలనలో కార్పొరేట్లకు సుమారు లక్షా 20 వేల కోట్ల అప్పులను మాఫీ చేసిందని - ఒక్క రూపాయి కూడా రైతుల అప్పులను కేంద్రం మాఫీ చేకలేపోయిందన్నారు. హుదుద్ తుఫాను వల్ల విశాఖ - విజయనగరం - శ్రీకాకుళం జిల్లాల్లో తీవ్రంగా నష్టం జరిగిందని, తక్షణ సాయంగా ప్రధాని మోదీ వెయ్యి కోట్ల రూపాయల సాయం ప్రకటించి రూ. 450 కోట్లు విదిలించారని వివరించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ బీమా విషయంలోనూ మోడీ ఏమి చేయలేదన్నారు.
పెద్ద నోట్ల రద్దు వలన దేశంలో అధికంగా నష్టపోతున్నది రైతులేనని రఘువీరా అన్నారు. రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతులు పండించిన పూలు - పండ్లు - కూరగాయలు - చేపలు - రొయ్యలు కుళ్లిపోతున్న పరిస్థితి దేశంలో తలెత్తిందని రఘవీరారెడ్డి అన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు సంబంధించి రాజ్యసభను కూడా అరుణ్ జైట్లీ తప్పుదోవ పట్టించారని, దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సభాహక్కుల నోటీసు కూడా ఇచ్చారని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/