కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఎక్కువైంది. ఆప్యాయత కురిపిస్తోంది. ప్రజలపై అనుకుంటున్నారా.... అలా అనుకుంటే తప్పే. కొత్త స్నేహితుడు - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ పార్టీ వల్లమాలిన ప్రేమ చూపిస్తోంది. నిజానికి తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలు ఉప్పు నిప్పు ........భూమి ఆకాశం లాగే రెండున్నర దశాబ్దాలుగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలకి ఒకరంటే ఒకరికి ఆగర్భ శత్రుత్వమే. అయితే ఈ రెండు పార్టీలు మాత్రం తెలంగాణలో జరుగునున్న ముందుస్తు ఎన్నికలలో కలసి పోటి చేసేందుకు దగ్గరయ్యాయి. దీంతో ఈ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురించి మొగ్గలు వేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలసి అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించాలని చంద్రబాబు నాయుడు వ్యూహం. దీనికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించింది. ఒకటి రెండు రోజులలో తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలో మధ్య ముందస్తు పొత్తు పొడవనుంది. సరిగ్గా ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు, మరో 14 మందిపై మహారాష్ట్ర ప్రభుత్వం నాన్ బేయిలబుల్ వారంట్లు జారి చేసింది. అంతే కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశానికి మిత్రపక్షం అయిపోయింది. 20 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని దుమ్మేత్తి పోసిన అక్కడి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి చంద్రబాబుపై కేసులు పెట్టడం అన్యాయమని ప్రకటిస్తున్నారు.హఠాత్తుగా కుదిరిన స్నేహాలు - పొత్తుల బంధాలతో ఏపీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కు బాసటగా నిలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్య కుదిరిన పొత్తుతో ఏపీలో కూడా అధికారాన్ని పంచుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల ఆలోచనగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిన్నటి వరకూ చంద్రబాబు నాయడిపై నిప్పులు కురిపించిన రఘవీరా రెడ్డి హఠాత్తుగా ప్రేమను కురిపించడం ఏమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించామనే అపవాదుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును అడ్డం పెట్టుకుని బలపడాలనుకుంటోదని ఆంధ్రప్రేదేశ్ కు చెందిన సినీయర్ జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పైన, అందుకు కారకుడైన చంద్రబాబు పైన కూడా ఆగ్రహంతోనే ఉన్నారని ఆయన చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి చంద్రబాబు నాయుడిని ఎంత వెనకేసు వచ్చిన ప్రజలు మాత్రం ఆ రెండు పార్టీలను నమ్మరని చెబుతున్నారు.