రఘువీరా 2017 టార్గెట్ చూస్తే షాకే

Update: 2016-12-31 01:30 GMT
ఏపీలో కాంగ్రెస్ ను ఎక్మో పరికరం(జయలలితకు గుండెపోటు వచ్చిన తరువాత అమర్చిన లైఫ్ సపోర్టు డివైస్) సహాయంతో బతికిస్తున్న పీసీసీ ప్రధాన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రఘువీరారెడ్డి 2017 నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ప్రాణాపాయం నుంచి బయటపడేయాలని భావిస్తున్నారట. అందుకోసం ఆయన భారీ టార్గెట్లే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన టార్గెట్ గురించి విన్నవారంతా పగలబడి నవ్వి వెళ్లిపోతున్నారట. ఇంతకీ కొత్త సంవత్సరంలో ఆయన టార్గెట్ ఏంటో తెలుసా...? టీడీపీ - వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తేవడం. మీకూ నవ్వొస్తోంది కదా.
    
పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఈ కొత్త టార్గెట్ పెట్టుకోవడానికి కారణం ఉంది. తమ పార్టీకే చెందిన ఇతర రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు సాధించిన విజయాలు చూసి ఆయన ఇన్స్పైర్ అయి ఈ టార్గెట్ ఫిక్సు చేసుకున్నారట.  ముఖ్యంగా రాజస్థాన్ లో దాదాపుగా ఏపీలో ఉన్నట్లే ‘చితి’కిపోయిన కాంగ్రెస్ కు యువ నేత సచిన్ పైలట్ పీసీసీ అధ్యక్షుడిగా  ఉన్నారు.  ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన ఓ మాజీ ఎమ్మెల్యేను మళ్లీ పార్టీలోకి తెచ్చారు. అంతేకాదు.. ఏం వ్యూహం రచించాడో ఏమో కానీ అత్యంత బలంగా ఉన్న అక్కడి బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను ఏమీ లేని కాంగ్రెస్ లోకి లాగేశారు.  అంపశయ్యపై ఉన్న తమ పార్టీలోకి కూడా వ‌ల‌స‌లు ఉన్నాయ‌ని సచిన్ పైలట్ నిరూపించారు.
    
సచిన్ ను  ఆద‌ర్శంగా తీసుకొని పంజాబ్‌ లో కూడా ఇదే ప్ర‌యోగం చేశారు కెప్టెన్ అమ‌రేంద‌ర్‌ సింగ్‌. ఇటీవలే ఇద్ద‌రు అకాలీద‌ళ్ ఎమ్మెల్యేలు - బిజెపికి రాజీనామా చేసిన మ‌రో మ‌హిళా ఎమ్మెల్యేను కాంగ్రెస్‌ లోకి లాగారు. దీంతో అమ‌రేంద‌ర్‌ సింగ్‌ కాంగ్రెస్ పార్టీలో మరోసారి హీరో అయ్యారు. వీటిని చూసిన పి.సి.సి అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి స్పూర్తిపొందారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కాంగ్రెస్‌ కు పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని భావించే త‌రుణంలో ఇక్క‌డ ఏదో ఒక‌టి చేయాల‌నే ఉత్సాహంతో ర‌ఘువీరా ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా ఇంతవరకు వర్కవుట్ కాలేదు. కొత్త సంవత్సరంపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News