ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కి వర్తమన తరానికి వారసుడు రాహుల్ గాంధీ. ఆయన వయసు యాభై ఏళ్ళు దాటినా ఇంకా యువ నాయకుడే. అదేంటో ఆయన ముఖంలో కూడా యవ్వనపు పాళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి. ఆయనది దాదాపు రెండు దశాబ్దాల ప్రత్యక్ష రాజకీయ ప్రయాణమైనా కూడా ఇంకా కుర్రతనపు రాజకీయం మాత్రం ఎక్కడా పోలేదు, పోదు కూడా. అందుకే రాహుల్ చాలా మందికి నచ్చుతారు. ముఖ్యంగా యూత్ కి ఆయన ఇంకా బాగా నచ్చుతారు.
ఆయన మాటలలో రాజకీయం కంటే సగటు మనిషి మాటలే ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సార్లూ ఏ లాజిక్కూ మ్యాజిక్కూ లేకుండా కూడా ఆయన మాట్లాడేస్తూంటారు. అందుకే రాహుల్ కేవలం ఎంపీగా ఏళ్ళకు ఏళ్ళూ వెళ్ళదీస్తున్నా క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఆయన ఏనాటికైనా ప్రధాని అవుతారని భావించే వారూ ఉన్నారు. అలాగే యాభై పడిలో పడినా కూడా ఏ రోజు అయినా పెళ్ళి కొడుకూ అవుతారని ఆశపడేవారూ ఉన్నారు.
ఇక విషయానికి వస్తే రాహుల్ గాంధీ దాదాపుగా నాలుగేళ్ళ తరువాత తెలంగాణాలో అడుగుపెట్టారు. ఆయన ఈసారి టూర్ కి కాస్తా ప్రిపేర్ అయ్యే వచ్చారు అని వ్యవహార శైలి చెబుతోంది. వరంగల్ సభలో రాహుల్ మాట్లాడిన దాంట్లో విభేదించే వారు పెద్దగా ఎవరూ లేరు. పైగా ఆయన్ని పొగిడే వారే ఉన్నారు. రాహుల్ చాలా సత్యాలు చెప్పారని తెలంగాణా సమాజంలో అత్యధికులు అనుకుంటున్న మాట.
ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి. తెలంగాణాలో ఎంత చెడ్డా కాంగ్రెస్ ఈ రోజుకీ పెద్ద పార్టీయే. ఇంకా చెప్పాలీ అంటే అధికారంలో ఉన్న టీయారెస్ కన్నా కూడా పెద్ద పార్టీ. అదొక విషయం అయితే తెలంగాణా ప్రజనీకానికి కాంగ్రెస్ మీద సానుభూతి కూడా చాలానే ఉంది. తమ కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం తాను అతి పెద్ద త్యాగం చేసిందన్న బాధ కూడా ఉంది.
అయితే కోపం, చికాకు అంతా లోకల్ కాంగ్రెస్ లీడర్ల మీదనే. తాము అధికార దండ వేస్తామని గట్టిగా చెబుతున్నా దాన్ని ముక్కలు చెక్కలుగా పీలికలు చీలికలుగా చేసి ఆ దండను నామరూపాలు లేకుండా చేసే అనైక్యత లోకల్ కాంగ్రెస్ నేతలది. ఆ ఒక్క అతి పెద్ద కంప్లైంటే తెలంగాణాలో కాంగ్రెస్ ని అధికారం నుంచి ఎపుడూ దూరం పెడుతోంది.
ఇక కాంగ్రెస్ కి ఒక చాన్స్ ఇవ్వాలని ప్రజలకు బలంగానే ఉంది. దానికి ఒక లాజిక్కు కూడా ఉంది. కాంగ్రెస్ తెచ్చిన పార్టీగా టీయారెస్ కి రెండు సార్లు చాన్స్ ఇచ్చిన జనాలు దాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కి కూడా ఒక చాన్స్ ఇవ్వాలి కదా. ఈ విషయమే జనం మది చదివిన నాయకుడిగా రాహుల్ గాంధీ కూడా తెలంగాణా సభలో చెప్పుకొచ్చారు.
ఒక విధంగా ఆయన న్యాయమైన అప్పీల్ చేశారు అని కూడా అనాలి. కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిన పార్టీ అని గుర్తు చేస్తూ తమకో చాన్స్ ఇవ్వాలని ఆయన అడిగేశారు. తెలంగాణా వచ్చింది అంటే అది ఏ ఒక్కరి వల్లనో కాదు అంటూ ఆ క్రెడిట్ ని తన సొంతం చేసుకున్న టీయారెస్ కి రాహుల్ బాగానే షాకిచ్చారు. ఒక విధంగా రాహుల్ చాలా న్యాయంగానే అడిగారు. తెలంగాణాను ఇచ్చిన పార్టీగా తమ పాలనను కూడా ఒక అయిదేళ్ళ పాటు చూడాలని కోరుకోవడంలో ఎంతో అర్ధం ఉంది. ధర్మం కూడా ఉంది.
నిజానికి ప్రజలు కూడా ఇపుడు అదే రకమైన ఆలోచనలో ఉన్నారు అంటున్నారు. అయితే అటు రాహుల్ ఓకే. ఇటు జనాలూ ఓకే. కానీ మధ్యలో అనుసంధానంగా ఉండాల్సిన లోకల్ లీడర్స్ ఓకేనా అన్నదే పెద్ద డౌట్. ఎందుకంటే వారంతా ఒక్క మాట మీద ఉంటారా. మేము అంతా ఒక్కటి అని గ్రూపు ఫోటో దిగుతారా. అది జరిగిన నాడు తెలంగాణాలో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో రావడం ఖాయం. అందులో ఎలాంటి డౌటూ లేదు.