కాంగ్రెస్ అగ్ర నేత. అయిదవతరం గాంధీ వారసుడు రాహుల్ గాంధీ తన సుదీర్ఘ పాదయాత్ర భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలో ఈ రొజు అడుగుపెట్టారు. ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలోని డీ హరేల్ మండలంలో మారెమ్మ గుడి వద్ద కర్ణాటక-ఏపీ సరిహద్దులో ఆయన ఏపీలో పాదం మోపారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాధ్ తో పాటుగా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఆయనను సాదరంగా రాష్ట్రంలోకి ఆహ్వానించారు.
మూడు కిలోమీటర్ల దూరం ఏపీ సరిహద్దుల్లో రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఆ తరువాత ఆయన తిరిగి కర్నాటక బళ్లారి మీదుగా అక్కడ ప్రవేశిస్తారు. ఇదిలా ఉండగా ఏపీలో జగన్ సీఎం అయ్యాక రాహుల్ అడుగు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ధిక్కరించి సొంతంగా పార్టీ పెట్టి జగన్ సీఎం అయ్యారు. ఇక కాంగ్రెస్ ఆ తరువాత రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాలేక చతికిలపడింది.
మూడవసారి 2024లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పడుతున్న తాపత్రయంలో భాగమే రాహుల్ సుదీర్ఘ పాదయాత్ర. ఇదిలా ఉండగా రాహుల్ ఏపీలోకి అడుగుపెడుతూనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీద పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. అంతే కాదు ఏపీలో జగన్ జమానా ఎలా ఉంది అని వాకబు చేసినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో జగన్ మొత్తానికి మొత్తం కాంగ్రెస్ నాయకత్వాన్ని తన వైపునకు లాగేసుకున్నారు. ఓటు బ్యాంక్ మొత్తాన్ని తన వైపుగా టర్న్ చేసుకున్నారు. కాంగ్రెస్ కి ఈ రోజు చెప్పుకోదగిన నాయకులు అయితే లేదు. మొదటి నుంచి ఉన్న వారే ఇపుడు రాహుల్ పాదయాత్రలో కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ ఏపీలోకి రావడం ద్వారా ఉన్న కొద్ది పాటి కాంగ్రెస్ శ్రేణులకు జోష్ తెప్పించారు. అంతే కాదు ఆయన ఈ నెల 17న మరోసారి ఏపీలోకి ప్రవేశించి వారం రోజుల పాటు పాద యాత్ర చేస్తారు.
అపుడు ఏపీ గురించి పూర్తి స్థాయిలో ఆయన వివరాలు అన్నీ తెలుసుకుంటారు అని అంటున్నారు. జగన్ పాలన మీద ఆయన ఈ వారం రోజుల పాదయాత్ర మీదనే సభను నిర్వహించి మరీ విమర్శలు సంధిస్తారు అని అంటున్నారు. ఇక రాహుల్ పాదయాత్ర ప్రవేశించిన పాదయాత్ర రాయదుర్గంలో కొంతసేపు సాగింది. ఇది వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.
మరి రాహుల్ ఈ స్వల్ప వ్యవధి పాదయాత్రలోనే ఏపీ గురించి వైసీపీ పాలన గురించి పూర్తిగా తెలుసుకుంటూ స్థానిక జనాలను కూడా ఆరా తీస్తూ ముందుకు సాగారు. సో మరో వారంలో ఆయన డైరెక్ట్ గా జగన్ మీద తన మాటలతో దాడి చేసి సవాల్ చేస్తారు అని అంటున్నారు. మరి రాహుల్ జగన్ పాలన మీద ఎలాంటి డైనమైట్లు పేలుస్తారో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.