ఒక కమర్షియల్ సినిమాకు అవసరమైన ముడిసరుకు మాల్యా జీవితంలో ఉంటుంది. ఎత్తుపల్లాలే కాదు.. వేల కోట్ల ప్రజాధనాన్ని తన విలాసాల కోసం వినియోగించటం.. తనకున్న పవర్ తో పెద్ద పెద్ద వ్యవస్థలు సైతం తనకు వంగి.. వంగి నమస్కారాలు చేయటమే కాదు.. బ్యాంకులకు వేల కొట్లు ఎగ్గొట్టి.. దర్జాగా దేశం విడిచి పారిపోయేందుకు వీలుగా సిస్టమ్ సెట్ చేసుకున్న సత్తా విజయ్ మాల్యా సొంతం.
యాభైకి పైగా సూట్ కేసుల లగేజీతో ఆయన ఎంత దర్జాగా దేశం విడిచి పారిపోయిన విషయం బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి పుణ్యమా అని జాతి ప్రజలకు తెలిసిందని చెప్పాలి. తెల్లారింది మొదలు నిత్యం జాతీయత గురించి.. దేశం గురించి మాట్లాడే బీజేపీ ఆగ్ర నేతలే మాల్యా గ్రేట్ ఎస్కేప్ కు పూర్తిస్థాయిలో సహకరించిన వైనంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తాజాగా మండిపడ్డారు.
మాల్యా పరారీ వెనుక సీబీఐ.. ప్రధాని మోడీ హస్తం ఉందన్న ఆరోపణను ఆయన చేశారు. మాల్యాపై జారీ అయిన లుకౌట్ నోటీసును సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ బలహీనపర్చినట్లుగా ఆరోపించారు. గుజరాత్ కేడర్ అధికారి అయిన శర్మ.. మోడీ కనుసన్నల్లో సీబీఐ నడిచేలా చేశారని రాహుల్ మండిపడుతున్నారు.
సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మనే మాల్యా మీద జారీ అయిన లుకౌట్ నోటీసుల్ని బలహీనపర్చారన్నారు. ఆయన మోడీ కనుసన్నల్లో నడిచారని ఆరోపించారు. మాల్యాతో పాటు నీరవ్ మోడీ.. మెహుల్ చోక్సీ పారిపోయేందుకు సీబీఐ సహకరించిందంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజున ఏకంగా ప్రధాని మోడీని మాల్యా ఎపిసోడ్ లోకి తీసుకురావటం సంచలనంగా మారింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాల్యా పరారీలో పెద్ద హస్తాల పాత్ర ఉందా? అన్నది ఇప్పుడు సందేహంగా మారిందని చెప్పక తప్పదు.