నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఈడీ అధికారుల ముందు జూన్ 20న సోమవారం మరోసారి హాజరుకానున్నారు. ఇప్పటికే జూన్ 13 నుంచి 15 వరకు మూడుసార్లు రాహుల్ గాంధీని ఎనఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను విచారించిన సంగతి తెలిసిందే.
మళ్లీ తిరిగి ఈ నెల 17న హాజరు కావాలని రాహుల్ గాంధీకి సూచించగా ఆయన విచారణను వాయిదా వేయాలని కోరారు. తన తల్లి సోనియాగాంధీకి ఆరోగ్యం బాగోలేదని.. అందువల్ల విచారణను జూన్ 20కి వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు జూన్ 20న సోమవారం రాహుల్ ను మరోమారు విచారించనున్నారు.
కాగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు రాహుల్ గాంధీని మూడు రోజుల్లో 30 గంటల పాటు విచారించారు. జూన్ 20న సోమవారం జరిగే విచారణలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు వైఐఎల్ కి బదలాయించడం, షేర్ల వాటాలు, ఆర్ధిక లావాదేవీల అంశాలపై రాహుల్ ను ప్రశ్నిస్తారని సమాచారం.
కాగా ఇదే కేసుకు సంబంధించి జూన్ 23న ఈడీ ఎదుట కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా హాజరు కావాల్సి ఉంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ.. ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సోనియాను ప్రస్తుతానికి విచారణ నుంచి అధికారులు మినహాయించారు. ఆమె కోలుకోగానే విచారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
కాగా మరోవైపు రాహుల్ గాంధీ పట్ల మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 20న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ పట్ల కేంద్రం కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. పార్టీ నేతలంతా నిరసనలు శాంతియుతంగా చేపట్టాలని ఆయన కోరారు.
అలాగే జూన్ 20న సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ నేతల బృందం కలవనుంది. రాహుల్ గాంధీపై ఈడీ విచారణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, కాంగ్రెస్ ఎంపీలపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.