ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ప్రక్రియ కూడా వేగవంతం అవుతోంది. ఆయన్ను వచ్చే నవంబరులో పట్టాభిషిక్తుడిని చేస్తారని తెలుస్తోంది.
నిజానికి ఆగస్టులోనే రాహుల్ పార్టీ అధ్యక్షుడు అవుతారని అంతా భావించారు. అయితే... వారణాసి పర్యటనలో సోనియా గాయపడడంతో అది వాయిదా పడింది. తాజాగా ముహూర్తం శీతాకాల సమావేశాలకు మారింది. ఆ సమయంలో అయితే పార్టీ ఎంపీలు - నేతలు ఢిల్లీలో అందుబాటులో ఉంటారని... అందుకే అప్పుడే ఏఐసీసీ పునర్ వ్యవస్థీకరణ - రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పే పని పూర్తి చేస్తారని ఢిల్లీలో వినిపిస్తోంది.
మరోవైపు రాహుల్ సోదరి ప్రియాంకను కూడా క్రియాశీలం చేయబోతున్నారు. యూపీ ఎన్నికల్లో రాయ్ బరేలి - అమేథి నియోజకవర్గాలకు మాత్రమే ఆమెను పరిమితం చేయకుండా రాష్ట్రమంతా ప్రచారం చేయించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రాహుల్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని చెబుతున్నారు.