పుల్వామాలో భారత సైనికుల మరణానికి పాకిస్తాన్ కు ధీటుగా బదులిస్తామన్న భారత్ అన్నంత పనిచేసింది. ఈరోజు ఉదయం 3.30 గంటలకు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై యుద్ధ విమానాలతో దాడులు చేయించి హతమార్చింది. ఈ దాడుల్లో 200 మంది నుంచి 300 మంది చనిపోయినట్టు సమాచారం. ఈ క్రమంలో ఉగ్రవాదులను హతమార్చిన భారత వాయుసేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. అమరజవాన్లకు దీంతో ఘనమైన నివాళి అర్పించారంటూ దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు...
మొదట భారత వైమానిక దళ పైలెట్లకు సలాం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేసి అభినందించారు. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా భారత వైమానిక దళాన్ని ఐఏఎఫ్ ను ఉద్దేశించి ‘ఇండియన్ అమేజింగ్ ఫైటర్స్ అంటూ అభివర్ణించారు . ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం .. ‘పాక్ ఉగ్రవాదులపై దాడి చేసి ఇంతటి సాహసాన్ని ప్రదర్శించి మనల్ని గర్వపడేలా చేసిన భారత వాయుసేన పైలెట్లకు సెల్యూట్ ’ అని ప్రశంసించారు.
భారత్ వాయుసేనపై పలువురు మాజీ క్రికెటర్లు - క్రికెటర్లు స్పందించారు. ‘జవాన్లు మీ ఆట అదిరింది’ అంటూ వీరేంద్ర సేహ్వాగ్ తన ట్విట్టర్ లో అభినందించారు. మరో క్రికెటర్ గౌతం గంభీర్ ‘జై హింద్ ఐఏఎఫ్’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక భారత వైమానిక దాడులపై బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. భారత సైన్యాన్ని కొనియాడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘పొద్దుగాల పొద్దుగాల మన భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి పోయి దాదాపు వెయ్యి కేజీల బాంబును పేల్చి వచ్చింది. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తామని మోడీ అన్నట్లే చేశారు. పాక్ కు భారత్ గట్టిగా జవాబిచ్చింది. భారత సైన్యానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు.. జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే.. ఇంకా పాక్ ను మొత్తం తగులబెట్టాలి. ఆ సమయం త్వరలోనే వస్తుంది’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు.