పౌరసత్వ సవరణ చట్టాని కి వ్యతిరేకం గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట్టుడుకుతోంది. అక్కడ ఇప్పటికే పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 18కి చేరింది. తాజాగా ఢిల్లీకి సమీపంలోని మీరట్ లో ఐదుగురు చనిపోయారు. దీంతో వారి కుటుంబాలను పరామర్శించడానికి మంగళవారం మీరట్ వెళ్లడానికి రెడీ అయ్యారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీలు.
కొద్ది మంది నేతల తో కారులో బయలు దేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల కు యూపీ లోని బీజేపీ సర్కారు షాక్ ఇచ్చింది. మీరట్ శివారులోనే వారిద్దరిని పోలీసులు అడ్డుకున్నారు.
మీరట్ లో అట్టుడుకుతోందని.. పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను ఇప్పుడు పరామర్శించడానికి వీల్లేదని రాహుల్, ప్రియాంకలను పోలీసులు అడ్డుకున్నారు. పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకోవడంతో ప్రియాంక, రాహుల్ లు చేసేదేం లేక వెను దిరిగారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ యూపీ పోలీసుల తీరు ను కడిగేశారు. చంపేసిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళితే ఎందుకు ఆపుతున్నారని పోలీసుల ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని.. నిర్లక్ష్యం గా తిప్పి పంపారని ఆరోపించారు.