పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

Update: 2016-11-02 11:30 GMT
దేశాన్ని పాలించిన ముగ్గురు ప్రధానుల కుటుంబం అది.. ఆ కుటుంబ వారసుడాయన... ఎప్పటికైనా ఆయన ప్రధాని అవుతారన్న అంచనాలు భారీగా ఉన్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో కీలక నేత.. పార్టీ పగ్గాలు చేపట్టబోయేదీ ఆయనే. అంత నేపథ్యమున్న కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ ఓపీ) కోసం పోరాడుతున్న మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్(70) కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా జంత‌ర్‌ మంత‌ర్ వ‌ద్ద ఆత్మహ‌త్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ కిష‌న్ గ్రేవాల్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు ఢిల్లీలోని ఆర్ ఎంఎల్ ఆసుప‌త్రికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వెళ్లారు.  అయితే.. ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలోకి రాజ‌కీయ‌నాయ‌కులు వ‌చ్చి ఆటంకాలు సృష్టించ‌కూడ‌ద‌ని పోలీసులు కోరినా ఆయన వినకపోవడంతో ఆయన్ను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.

దీంతో కాంగ్రెస్ నేతలు - శ్రేణులు దేశవ్యాప్తంగా మండిపడుతున్నాయి. రాహుల్ గాంధీ కూడా మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్ఓపీని కేంద్రం సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరును నిరసించి ఆత్మార్పణం చేసుకున్న మాజీ సైనికుడిని పరామర్శించడానికి వెళ్లిన తమ నేతనే అరెస్టు చేస్తారా అంటూ కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు గ్రేవాల్ ను పరామర్శించేందుకు వెళ్లిన ఆప్ నేత మనీశ్ సిసోడియాను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News