ఔను! సాక్షాత్తు బీజేపీ రథసారథి - ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను వెల్లడిస్తూ...కోరికను కోరితే ఆయన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నెరవేర్చాడు. అది కూడా కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే రాహుల్ గాంధీ ప్రధానికి ఈ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ ఇదంతా దేని గురించి అంటే..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానసపుత్రిక అయిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అయిన మన్ కీ బాత్ గురించి!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతి నెల చివరి ఆదివారం రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించే సంగతి తెలిసిందే.ఈ నెల చివరి ఆదివారం 28న జరిగే మన్ కీ బాత్ కార్యక్రమం కోసం సూచనలివ్వాలని ప్రజలను ప్రధాని మోడీ కోరారు. ఈ మేరకు 18వ తేదీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. మోడీ మన్ కీ బాత్ విషయంలో రాహుల్ గాంధీ సూచనలు చేశారు. ప్రియమైన మోడీ గారు! మీరు నెలవారీగా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో సూచనలివ్వాలని కోరారు. దాని ప్రకారం యువతకు ఉపాధి ఎలా కల్పిస్తారు? డోక్లాం నుంచి చైనాను ఎప్పుడు తరిమికొడతారు? హర్యానాలో లైంగిక దాడులను పూర్తిగా ఎప్పుడు నివారిస్తారో మీ ప్రణాళికల్ని తెలియజేయండి అని ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన - హర్యానాలో మహిళలపై లైంగికదాడుల నివారణ - డోక్లాం నుంచి చైనాను తరిమికొట్టడానికి ప్రణాళికలను వెల్లడించాలని ప్రధాని మోడీని రాహుల్ గాంధీ కోరారు. కాగా, రాహుల్ ట్వీట్ పై కాంగ్రెస్ పార్టీ నెటిజన్లు సైతం స్పందించారు. ప్రధానమంత్రి దేశంలో ఉన్న సమస్యలను తాము చేరవేశామని పేర్కొంటూ ఇక ఆయా అంశాలపై స్పందించడం ఆయన చేతిలో ఉందని ట్వీట్లు చేశారు.