అధికారపక్షంలో ఉంటే సవాలచ్చ పనులుంటాయి. ప్రతిపక్షంలో ఉంటే పలుకరించే నాథుడే ఉండదన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వేళలో.. ప్రజా సమస్యలపై చట్టసభల్లో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ.. సభకు హాజరయ్యే విషయంలో విపక్షానికి చెందిన కీలకనేత హాజరు అంతంత మాత్రంగా ఉంటే ఏమనాలి? తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు చూస్తే ఇలాంటి భావన కలగక మానదు. విపక్షంతో పాటు.. అధికారపక్షం నేతలు సైతం చట్టసభల్ని ఎంత లైట్ తీసుకుంటున్నారన్న విషయం తాజా గణాంకాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
లోక్ సభ సభ్యులు సభకు హాజరయ్యే అంశానికి సంబంధించి కొత్త గణాంకాలు బయటకు వచ్చాయి. తాజా వివరాల ప్రకారం చూస్తే.. మొత్తం 545 మంది లోక్ సభ సభ్యుల్లో కేవలం ఐదుగురు మాత్రమే వందశాతం సభా కార్యక్రమాలకు హాజరైనట్లుగా కనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో పోలిస్తే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు తక్కువగా ఉండటం కనిపిస్తుంది. రాహుల్ కంటే సోనియా ఎక్కువసార్లు సభకు హాజరైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. సభకు సోనియా గాంధీ హాజరు శాతం 59 శాతం ఉంటే.. రాహుల్ ది మాత్రం కేవలం 54 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
ఇక.. యూపీ ఎంపీ భైరన్ ప్రసాద్ మిశ్రా 1468 చర్చల్లో పాల్గొనటంతో పాటు సభలో అథ్యధికంగా 100 శాతం హాజరు ను సాధించారు. వీరితో పాటు బీజేడీకి చెందిన కుల్ మణి సమల్.. బీజేపీకి చెందన గోపాల్ శెట్టి.. కిరీట్ సోలంకి.. రమేశ్ చందర్ కౌశిక్‌లు కూడా ఉన్నారు. గడిచిన మూడేళ్లలో సోనియా మూడు చర్చల్లో మాత్రమే పాల్గొనగా.. రాహుల్ మాత్రం 11 చర్చల్లో పాల్గొన్నారు. మొత్తంగా చూసినప్పుడు 25 శాతం ఎంపీలు 90 శాతం కంటే ఎక్కువగా సభకు హాజరైతే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు వీరప్ప మొయిలీ.. మల్లికార్జున్ ఖర్చే లాంటి వారు మాత్రం 91.. 92 శాతంతో సభకు హాజరైన వైనం కనిపిస్తుంది ప్రజాసమస్యల పట్ల తనకున్న కమిట్ మెంట్ ఎలాంటిదన్న విషయంలో సభకు హాజరు విషయంలో రాహుల్ తన తీరును మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/