మోడీ ‘బేటి’పై రాహుల్ సంచలనం

Update: 2019-01-23 10:32 GMT
రెండు నెలల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీని ఉద్దేశించి చేసిన సెటైర్ బాగా పేలింది.. మీటూ ఉద్యమంలో ఇరుక్కుపోయిన బీజేపీ కేంద్రమంత్రి వైఖరిని ఎండగట్టారు.. ‘బేటి బచావో’ అంటూ మోడీ పిలుపునిస్తున్నాడని.. కానీ బీజేపీ నేతల నుంచే బేటీలను కాపాడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. బాలికలను చదువుల బాట పట్టించేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టిన ‘బేటి బచావా.. బేటి పడావో’ స్క్రీం పై రాహుల్ గాంధీ చేసిన ఈ విమర్శ పాపులర్ అయ్యింది.

తాజాగా ట్విట్టర్ లో మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా  బేటి బచావో అంటూ నరేంద్రమోడీ ఫొటోతో ఇస్తున్న ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇందులో ప్రచారం కోసం మాత్రమే మోడీ కోట్లు ఖర్చు చేస్తున్నాడని.. ఖర్చు బారెడు.. ఫలితం మూరెడు అన్నట్టు ఉందని ట్వీట్ లో ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా.. ‘మోడీ బచావో.. అడ్వటైజ్ మెంట్ చాలో’ అని ఈ పథకానికి స్లోగన్ పెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు ఈ పథకంలో నిధుల విషయంలో గోల్ మాల్ లు, అక్రమాలు జరిగాయని వచ్చిన నివేదికలకు సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

2014-15 నుంచి 2018-19 వరకు పథకానికి కేటాయించిన నిధుల కంటే 56 శాతం అధికంగా  ప్రచారానికి మీడియాలో ప్రకటనలకు ఖర్చు చేశారని రాహుల్ ఆధారాలతో బయటపెట్టడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.  నిధులు జిల్లాలు, రాష్ట్రాలకు  కనీసం 25శాతం కూడా పంపిణీ చేయలేదని.19శాతం నిధులను లబ్ధిదారులకు విడుదల చేయలేదని రాహుల్ గాంధీ ఆక్షేపించారు.

పార్లమెంటు సాక్షిగా బీజేపీయే ఈ లెక్కలను విడుదల చేసిందని రాహుల్ పేర్కొన్నారు. పార్లమెంటులో బీజేపీకి చెందిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి విజేంద్ర కుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ లెక్కలు చెప్పారని రాహుల్ వివరించారు. ఇలా ఊరుదిబ్బ.. పేరు గొప్పలా బీజేపీ పాలన సాగుతుందనడానికి ఈ పథకం నిదర్శనమని రాహుల్ ఎద్దేవా చేశారు.


Full View
Tags:    

Similar News