తెలంగాణ ఎన్నిక‌లు..కాంగ్రెస్ మ‌రో ట్విస్ట్‌

Update: 2018-09-14 16:59 GMT
తెలంగాణ రాజ‌కీయాలు హాట్ హాట్‌ గా మారుతున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నప్ర‌తి అంశంలోనూ జాగ్ర‌త్త తీసుకుంటోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణపై దృష్టి సారించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తెలంగాణ స్క్రీనింగ్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి భక్త చరణ్ దాస్‌ను చైర్‌ పర్సన్‌ గా నియమించగా.. మరో ముగ్గురు జ్యోతిమణి - సెంథిమలై - శర్మిష్ట ముఖర్జీలను సభ్యులుగా నియమించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. టీడీపీ - సీపీఐ - టీజేఎస్‌ తో మహాకూటమిగా ఏర్పడి.. టీఆర్ ఎస్‌ ను ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ భావిస్తున్న క్ర‌మంలో ఈ ప్ర‌క‌ట‌న కీల‌కంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సుమారు గంటన్నర పాటు రాహుల్ సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం దిశానిర్దేశం చేశారు. పొత్తుల అంశాన్ని రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయించాలని పార్టీ నేతలకు ఆయన సూచించినట్టు తెలిసింది. గెలువ గలిగే స్థానాలను  ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ వదులుకోకూడదని ఆయన టీ కాంగ్రెస్‌ నేతలకు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే రిపోర్టు ఉందని భరోసా ఇచ్చారు. నాయకులంతా ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. పార్టీ పరంగా  సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీట్ల సర్దుబాటు - ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయనతో చర్చలు జరిపిన అనంత‌రం అన్నింటినీ సమకూర్చుకుని కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ తో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News