సొంతిల్లు కాలిపోతుంటే పట్టించుకోని పెద్ద మనిషి.. ఊరికి న్యాయం జరగాలని పోరాటం చేయటం ఎలా ఉంటుంది? ఇంచుమించు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు అలానే ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతంలో న్యాయం జరగాలంటూ రికార్డుస్థాయిలో రెండు సార్లు హైదరాబాద్ కు రావటమే కాదు.. తాజాగా రోహిత్ సూసైడ్ మీద వర్సిటీ విద్యార్థులు కొందరు చేస్తున్న దీక్షలో పాల్గొనటం ద్వారా రాహుల్.. ఈ వ్యవహారాన్ని జాతీయ అంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
రోహిత్ సూసైడ్ విషయం మీద ఆయన అంత పట్టుదలగా వ్యవహరించటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. తెలంగాణ.. ఆంధ్ర రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. అయినప్పటికీ ఆ విషయాల్ని అస్సలు పట్టించుకోని ఆయన ఒక విద్యార్థి ఆత్మహత్య మీద ఇంతగా ఫోకస్ పెట్టటంపై కొందరు కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణరాష్ట్రం ఇచ్చి ఏపీలో పార్టీని చేజేతులారా భూస్థాపితం చేసుకున్నామని.. మరోవైపు తెలంగాణ ఇచ్చి కూడా ఎలాంటి రాజకీయ ప్రయోజనం పొందలేదు సరికదా.. రోజురోజుకి దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి టీఆర్ ఎస్ సర్కారును పొగిడేయటం షాకింగ్ గా మారింది. రూ.5 భోజన పథకం తమ హయాంలో షురూ అయినా.. క్రెడిట్ అంతా టీఆర్ ఎస్ సర్కారుకు ఇవ్వటంతో పాటు.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ మీద కూడా సర్కారుకు అనుకూలంగా మాట్లాడటం ఏమిటని వాపోతున్నారు.
గ్రేటర్ ఎన్నికల వేళ జానారెడ్డి లాంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో పార్టీకి అంతులేని నష్టం వాటిల్లనుందని టీ కాంగ్రెస్ నేతలు పలువురు వాపోతున్నారు. ఇలాంటి సవాలచ్చ ఇష్యూలు ఉన్నా ఏ మాత్రం పట్టించుకోని రాహుల్ గాంధీ.. ఒక విద్యార్థి ఆత్మహత్య విషయంలో అంతులేని ఆసక్తి ప్రదర్శిస్తున్నారని.. నిజానికి ఆయన అనుకున్నట్లుగా తనకు నేరుగా ప్రత్యర్థి అయిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై విజయం సాధిస్తారో లేదో కానీ.. పార్టీ విషయంలో ఆయన ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదన్న మాట వినిపిస్తోంది.
అయితే.. ఈ వాదనను కొట్టిపారేస్తున్న వారూ లేకపోలేదు. రోహిత్ ఇష్యూను జాతీయ అంశంగా మార్చటంలో రాహుల్ సక్సెస్ అయ్యారని.. ఈ అంశంతో దళితులకు అండగా పార్టీ ఉందన్న విషయాన్ని జాతీయ స్థాయిలో రాహుల్ తన చర్యలతో నిరూపించారన్న వాదననుకొందరు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు పలువురు.. తాము దళితులకు వ్యతిరేకంగా కాదని.. తమకు ఆ ఉద్దేశ్యం లేదంటూ వరుసగా చేస్తున్న ప్రకటనలే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. రాహుల్ తీరుపై తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తున్న భిన్నాభిప్రాయాల్లో ఏది నిజమన్నది కాలమే తేల్చగలదు.