కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ఫేక్ వీడియో ను సృష్టించిన జీటీవీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ ను పోలీసులు మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ హైడ్రామా నెలకొంది. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రాహుల్ గాంధీకి చెందిన ఓ వీడియోను తప్పుడు రీతిలో ప్లే చేసిన కేసులో రోహిత్ రంజన్ ను అరెస్ట్ చేయడానికి చత్తీస్ ఘడ్ పోలీసులు వెళ్లారు. కానీ అంతకుముందే రోహిత్ రంజన్ స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో యూపీ పోలీసులు ఆ అరెస్ట్ ను అడ్డుకొని వారితో తీసుకెళ్లారు. అదుపులోకి తీసుకునే ముందు ఈ అరెస్ట్ వ్యవహారంపై రోహిత్ రంజన్ ఓ ట్వీట్ కూడా చేశారు.
స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చత్తీస్ గఢ్ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వచ్చారని.. ఇది చట్టపరంగా సరైందేనా? అని ప్రశ్నించారు. అయితే దీనికి రాయ్ పూర్ పోలీసులు సమాధానం ఇచ్చారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ ఎలాంటి రూల్ లేదని.. అయినా తాము తెలియజేశామని చెప్పారు. అలాగే అరెస్ట్ వారెంట్ కూడా చూపించామన్నారు. దర్యాప్తునకు సహకరించాలని చెప్పారు.
రాహుల్ ఫేక్ వీడియోని ప్లే చేసినందుకు ఆ టీవీ యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది. కానీ ఆ టీవీ చానెల్ యాజమాన్యం.. యాంకర్ రోహిత్ రంజన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రాయ్ పూర్ లో కేసు పెట్టారు. దాంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
కేరళలలోని వయనాడ్ లో తన ఆఫీసుపై దాడి చేసిన వారిని చిన్నపిల్లలుగా పేర్కొంటూ వారికి వ్యతిరేకంగా తనకు ఎలాంటి దురుద్దేశం లేదని రాహుల్ గాంధీ వీడియో సందేశమిచ్చారు. దానిని వక్రీకరిస్తూ ఉదయ్ పూర్ కు చెందిన టైలర్ కన్హయ్యలాల్ హంతకులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ మాటలు అన్నట్టు ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.
రాహుల్ పై నకిలీ వీడియో వ్యవహారానికి సంబంధించి చత్తీస్ గఢ్ లో ముగ్గురు బీజేపీ ఎంపీలపై కూడా కేసు నమోదైంది. వీరు ఆ వీడియోను సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి వినియోగించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.