కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్న వేళ.. వాటిని అదుపు చేసే విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు దారుణంగా ఫెయిల్ అయ్యిందన్న మాట జాతి జనుల నోటి నుంచి బలంగా వినిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత వ్యతిరేకతను ప్రధాని మోడీ ఎదుర్కొంటున్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇలాంటి గడ్డు పరిస్థితిని గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలాఉంటే.. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర వైఫల్యాల మీద కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది.
ఏ చిన్న అవకాశం వచ్చినా విడవకుండా చెలరేగిపోతోంది. గతానికి భిన్నంగా రాహుల్ సైతం ప్రధాని మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యంగ్యస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీని వెంటిలేటర్ తో పోల్చిన పోలిక ఆసక్తికరంగా మారింది. పీఎం కేర్స్ వెంటిలేటర్లు.. ప్రధాని మోడీకి మధ్యన పోలికలు ఉన్నట్లుగా పేర్కొన్న రాహుల్.. ‘ఆ రెండు తమ బాధ్యతల్ని నిర్వర్తించటం లేదు. పీఎం కేర్స్ వెంటిలేటర్లు.. ప్రధాని మోడీ ఎక్కడా కనిపించరు’ అంటూ మండిపడ్డారు.
కొవిడ్ కేసులు తీవ్రంగా పెరిగిపోయిన వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా కనిపించటం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు మానవతావాదులు కరోనా బాధితులకు ఎనలేని సేవలు చేస్తున్నారని.. ప్రధాని మోడీ మాత్రం ఎక్కడా కనిపించటం లేదన్నారు. పీఎం కేర్స్ వెంటిలేటర్ల మాదిరి మోడీ కూడా ఎక్కడా కనిపించటం లేదన్న రాహుల్ ఎద్దేవా అందరిని ఆకర్షిస్తోంది.