దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ జోరు కొనసాగుతూనే ఉంది. అయితే , దేశంలో వ్యాక్సిన్ కొరత మాత్రం తీవ్రంగా ఉంది. కరోనా కట్టడికి కేవలం వ్యాక్సిన్ మాత్రమే ముందున్న మార్గం. అయితే , కరోనా వైరస్ టీకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చి ఉంటే దేశం ప్రస్తుతం ఇలాంటి బాధాకరమైన పరిస్థితులను చవి చూడాల్సి వచ్చేది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. చిన్నారుల కోసం కరోనా వైరస్ వ్యాక్సిన్, ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ ను అమల్లోకి తీసుకురావాలి అని అన్నారు.
ప్రధాని మోదీని ప్రశ్నించినందుకు ఎంత సులువుగా అరెస్టులు చేశారో, అంతే తేలిగ్గా అందరికీ అందుబాటులోకి టీకా తీసుకు వచ్చినట్లయితే దేశంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు దాపురించేవి కాదు. ప్రజలు అడిగే ప్రశ్నలను కాదు, కరోనాను ఆపండి అని రాహుల్ మంగళవారం ట్విట్టర్ లో ప్రభుత్వాన్ని విమర్శలు కురిపించారు. రానున్న రోజుల్లో, చిన్నారులకు కరోనా నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పీడియాట్రిక్ సేవలు, వ్యాక్సిన్, ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ ను ముందుగానే సిద్ధం చేయాలి అని కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. దేశ భవిష్యత్తుకు ప్రస్తుత మోదీ వ్యవస్థను నిద్ర నుంచి మేల్కొలపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
దేశంలో లో కరోనా కారణంగా మరణిస్తోన్న వారి సంఖ్య ప్రతిరోజు భారీగా నమోదవుతోంది. గడచిన 24 గంటల సమయంలో ఎన్నడూలేని విధంగా 4,529 మంది కరోనా కారణంగా మృతి చెందారు. నిన్న కొత్తగా 2,67,334 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,89,851 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,96,330కు చేరింది. మృతుల సంఖ్య 2,83,248కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,19,86,363 మంది కోలుకున్నారు.