తెలంగాణ కాంగ్రెస్ సైన్యంలో ఆ ఐదుగురికి షాక్

Update: 2018-09-20 06:16 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. కాంగ్రెస్ త‌న ఎల‌క్ష‌న్ వార్ క‌మిటీని ప్ర‌క‌టించింది. ప‌ది క‌మిటీల్లో స‌భ్యుల్ని ఎంపిక చేస్తూ.. ప్ర‌తి ఒక్క‌రికి ప్రాధాన్య‌త ల‌భించేలా క‌స‌ర‌త్తు చేసింది. అయితే.. జాబితాను చూసిన‌ప్పుడు పైకి ఇలా క‌నిపించినా.. కొంద‌రు ఆగ్ర నేత‌ల‌కు దిమ్మ తిరిగే షాకిచ్చింద‌ని చెప్పాలి. మ‌రి.. ముఖ్యంగా ఐదుగురు ముఖ్య నేత‌ల విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మ‌రాఇంది.

తాజాగా ప్ర‌క‌టించిన 10 క‌మిటీల్లో సామాజిక స‌మ‌తుల్య‌ను పాటించిన‌ట్లుగా క‌నిపించిన‌ప్ప‌టికీ.. ఐదుగురు కీల‌క నేత‌ల‌కు  ఆశించిన ప‌ద‌వులు ఇవ్వ‌కుండా షాకిచ్చింద‌ని చెప్పాలి.అన్నింటి మించి ఎన్నిక‌ల ప్ర‌చార క‌మిటీలో స్థానం ల‌భిస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న ముఖ్య‌నేత‌ల‌కు వారి పేర్లు క‌నిపించ‌కుండా చేసి అవాక్కు అయ్యేలా చేసింది.

ఎన్నిక‌ల ప్ర‌చార క‌మిటీ సార‌థ్య బాధ్య‌త‌ల్ని ఆశించిన మాజీ మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.. డీకే అరుణ‌తో పాటు.. ఇటీవ‌ల కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిల‌కు కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం హ్యాండ్ ఇచ్చింది. ఈ ప‌ద‌విని అనూహ్యంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు అప్ప‌గించింది. అంతేనా.. సీనియ‌ర్ నేత‌.. మాజీ కేంద్ర‌మంత్రి జైపాల్ రెడ్డి పేరు సైతం ఏ ముఖ్య క‌మిటీల్లోనూ లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. త‌ర‌చూ మీడియాలో సంద‌డి చేసే వీహెచ్ కు పెద్ద ప్రాధాన్య‌త ఉన్న ప‌ద‌విని అప్ప‌గించ‌క‌పోవ‌టం విశేషం. మొత్తంగా చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో ముఖ్య‌నేత‌లైన ఐదుగురి (జైపాల్‌.. వీహెచ్‌..రేవంత్‌..కోమ‌టిరెడ్డి.. డీకే అరుణ‌)కి త‌న‌దైన శైలిలో షాకిచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.


Tags:    

Similar News