యువరాజును ఫ్యామిలీ పేరుతో దెబ్బేస్తున్న స్మృతి

Update: 2016-01-18 04:46 GMT
రాజకీయ ప్రత్యర్థులు చెప్పే మాటల్లోని శ్లేషను ఉపయోగించి వారిపై విమర్శల దాడి చేయటం ఒక కళ. అలాంటి కళ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దగ్గర చాలానే ఉన్నట్లు కనిపిస్తోంది. అమేథి ప్రజల్ని తన సొంత కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొనటం తెలిసిందే. అమేథి కోటలో పాగా వేయాలన్న ఉద్దేశంతో తరచూ ఆ నియోజకవర్గంలో తరచూ పర్యటంచే కేంద్రమంత్రి స్మృతిఇరానీ తాజాగా మరోసారి పర్యటించారు.

ఈ సందర్భంగా రాహుల్ పై విమర్శల వర్షం కురిపించిన ఆమె.. అక్కడి ప్రజల మనసుల్ని దోచుకునేలా మాట్లాడారు. అమేథి ప్రజల్ని తన కుటుంబ సభ్యులుగా రాహుల్ చెప్పినప్పటికీ.. ఆయన తన కుటుంబ సభ్యుల బాధ్యతలే పూర్తి చేయలేని పరిస్థితిలో ఉండిపోయారని ఎద్దేవా చేశారు. గడిచిన రెండేళ్లలో తాను అమేథి ప్రాంతంలో పర్యటిస్తున్న సమయాల్లో శిలాపలకాలు మాత్రమే కనిపించాయే కానీ.. ఎక్కడా పనులు ప్రారంభమైన దాఖలాలు కనిపించలేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీపై అమేథి నియోజకవర్గం నుంచి తలపడి.. ఆయనపై ఓడిపోయారు. అయినప్పటికి అమేథిని వదిలిపెట్టకుండా అక్కడి వారి మనసుల్లో పాగా వేసేందుకు వీలుగా కేంద్రమంత్రి హోదాలో సదరు నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తుంటారు. మరి స్మృతి పెట్టుకున్న లక్ష్యానికి  ఏ మేర చేరుకుంటారో చూడాలి.
Tags:    

Similar News