మోదీని ఢీకొట్టే ప్లాన్‌ తో రాహుల్ రెఢీ

Update: 2019-01-28 15:14 GMT
అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించి వారి మనసులు గెల్చుకున్నారు మోదీ. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే.. ఉత్తరాది ఓట్లు చాలా కీలకం. అగ్రవర్ణాల్లో పేదలు ఎక్కువుగా ఉత్తరప్రదేశ్‌ - బిహార్‌ లోనే ఉన్నారు. దీంతో.. వారి ఓట్లను గెల్చుకునేందుకు చాలా కీలకమైన నిర్ణయం తీసుకుని అందరికి షాక్‌ ఇచ్చారు మోదీ. దీంతో.. ఇప్పుడు మోదీకే షాక్‌ ఇచ్చేందుకు రాహుల్‌ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అగ్రవర్ణాల పేదలంటే చాలా తక్కువమంది ఉంటారు. కానీ భారతదేశంలో పేదవాళ్లు చాలా ఎక్కువమంది. ఇంకా చెప్పాలంటే పోలింగ్‌ బూత్‌ వరకు వచ్చి ఓటు వేసేది వాళ్లే. అందుకే వారిని టార్గెట్‌ గా చేసుకుని వ్యూహాలు రచిస్తున్నారు రాహుల్‌. అందుకే 2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పేదలకు కనీసం వేతనం అందిస్తుందని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. అంతేకాదు పేదవారికి నేరుగా తమ బ్యాంక్ ఖాతాలోకే ఈ కనీస వేతనం జమ అవుతుందని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశం అమలు చేయని పథకాన్ని పేదల కోసం తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తుందని ప్రకటించారు. కనీసం వేతనం అంటే.. ప్రతీ ఒక్క పేదకు ఎంతో కొంత నగదు వారి ఎక్కౌంట్‌ లో పడుతుందన్నమాట.

గత ఎన్నికల్లో బ్లాక్‌ మనీ మొత్తం వసూలు చేసి అందరి ఎక్కౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ ప్రకటించారు. అయితే ఇది ఆచరణలో సాధ్యం కాలేదు కానీ చాలామందిపై ప్రభావితం చూపింది. ఇప్పుడు ఇంచుమించు ఇలాంటి కాన్సెప్ట్‌ తోనే అందరి ఎక్కౌంట్లలో కనీస వేతనం వేస్తానని అంటున్నారు రాహుల్‌ గాంధీ. మరి రాహుల్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా.. వెయిట్‌ అండ్‌ సీ.   
Tags:    

Similar News