కాంగ్రెస్ పార్టీ రథసారథిగా...యువరాజు రాహుల్‌గాంధీ పగ్గాల స్వీకరించిన వేళావిశేషం బాగా లేనట్లుంది. ప్రతిష్టాత్మకంగా సాగిన గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా..కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే...ఈ రెండు రాష్ర్టాల్లో అధికారంపై కాంగ్రెస్ కొండంత ఆశలు పెట్టుకుంటే...అది కాస్త నీరుగారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాహుల్ అధ్యక్షుడయ్యారనే ఆనందం ఆ పార్టీ నేతల్లో లేకుండా పోతోంది.
ఓట్ల లెక్కింపు మొదలయిన సమయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉండటంతో...కాంగ్రెస్ నేతల్లో సహజంగానే సంతోషం వ్యక్తమైంది. కానీ...ఆ తర్వాత అధికార బీజేపీ జోరు సాగుతుండటంతో...ఆ పార్టీ నేతలు నీరుగారిపోయారు. దీంతో కాంగ్రెస్ కార్యాలయం మూగబోయింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయమే కాకుండా... దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మూగబోయాయి. గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లో కాంగ్రెస్ వెనుకంజలో ఉండటంతో ఆ పార్టీ నేతలు తమ నివాసాలకే పరిమితమయ్యారు. దీంతో ఆ పార్టీ ఆఫీసులన్నీ జనాలు లేక వెలవెల బోతున్నాయి. అనుకున్నంతా స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు కలవరానికి గురవుతున్నారు.
కాగా, కాంగ్రెస్ వెనుకంజ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు (హవాన్) నిర్వహిస్తున్నారు. రెండు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వం విజయం సాధించాలని కాంక్షిస్తూ..ఢిల్లీలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలు - కుటుంబసభ్యులు పూజలు నిర్వహించారు. సోనియాగాంధీ - రాహుల్ గాంధీ ఫొటోలను పట్టుకుని పూజలు చేశారు. ఇక ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ సోనియాను కలిసి మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నం మీడియాతో రాహుల్ మాట్లాడనున్నారు.
ఇదిలాఉండగా...కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన ప్రశంసలు కురిపించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించకుండా - రాహుల్ ఒంటరిగా ప్రచారం చేసిన తీరును శివసేన మెచ్చుకుంది. చాలా కీలకమైన దశలో రాహుల్ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారని - ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం ఎంత మాత్రం వ్యర్థం కాదు అని శివసేనకు సంబంధించిన సామ్నా పత్రిక తన వ్యాసంలో వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును రాహుల్ కు వదిలేయడం మంచిదని ఆ పత్రిక పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ తారాస్థాయికి ఎదిగినా - లేక ఓడినా - అది రాహుల్ ఘనతే అవుతుందని సామ్నా వెల్లడించింది. బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతో రాహుల్ ముందకు వెళ్లిన తీరు అసాధారణమని - ఆయన పట్టుదల ఆయన్ను ముందుకు తీసుకువెళ్లుతుందని శివసేన అభిప్రాయపడింది.