కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. తాజాగా తాను ప్రాతినిధ్యం వహించే అమేధీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను అక్కడి ప్రజలు ఒక కోరిక కోరారు. రాహుల్ సోదరి ప్రియాంక వాద్రాను పాలిటిక్స్ లోకి తీసుకురావాలన్న డిమాండ్ ను పలువురు ఆయన ముందు ఉంచారు. ఈ అంశం మీద స్పందించిన రాహుల్.. ‘‘ఆమెను నేను కూడా రాజకీయాల్లోకి రావాలని చాలాసార్లు కోరాను’’ అని చెప్పుకొచ్చారు.
తన మాటను ప్రియాంక తోసి పుచ్చిందని చెప్పిన రాహుల్.. ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరించి తన సోదరి ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకు రావాలంటూ చమత్కరించటం గమనార్హం. అయినా.. ఇంట్లో వాళ్ల మాట వినని ప్రియాంక.. జనాల మాట వింటారా? తోడబుట్టినోడి మాట కంటే జనాల మాట వింటారని చెబుతున్న రాహుల్ మాట వింటే.. లెక్కలో ఏదో కాస్త తేడా వచ్చినట్లు కనిపించల్లేదు. అధికారం చేతికి రాకపోతే.. ఆఖరి అస్త్రంగా ప్రియాంకను దేశ ప్రజల మీద ప్రయోగించాలని భావిస్తున్న కాంగ్రెస్ వ్యూహానికి రాహుల్ తాజా వ్యాఖ్యలే నిదర్శనమా..?