ప‌ప్పు చేష్ట‌ల‌తో హోదాకు భారీ దెబ్బ‌!

Update: 2018-07-21 08:10 GMT
ఏపీ టైం ఏ మాత్రం బాగోలేదు. ఆంధ్రోళ్ల అదృష్టం చంద్ర‌బాబు పుణ్య‌మా అని ఎప్పుడో ముఖం చాటేసింది. ఇప్పుడు రాహుల్ రూపంలో మ‌రోసారి దెబ్బ ప‌డింది. మోడీ స‌ర్కారుపై పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఏపీకి ఎంతో కొంత మేలు జ‌రుగుతుందేమోన‌న్న దింపుడు క‌ళ్లెం ఆశ‌ను.. రాహుల్ త‌న తీరుతో చిదిమేశాడు. అవిశ్వాసం మీద మొద‌లైన చ‌ర్చ‌ను ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ సీరియ‌స్ గా ప్ర‌జంట్ చేశాడ‌ని చెప్పాలి.

అయితే.. ఆ వాతావ‌ర‌ణాన్ని కాంగ్రెస్ కానీ ముందుకు తీసుకెళ్లి ఉంటే మోడీ క‌చ్ఛితంగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డి ఉండేవారు. కానీ.. అలాంటిదేమీ చేయ‌ని రాహుల్ గాంధీ.. త‌మ‌దైన సొంత ఎజెండాలోకి వెళ్లారు. మైలేజీ మోజులో మోడీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసే ప‌ని చేశారు. ఏ మాత్రం లాభం చేయ‌ని ర‌ఫెల్ విమానాల కొనుగోలు అంశాన్ని తెర మీద‌కు తెచ్చి  కెలుక్కున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్ర‌తి చిన్న విష‌యంపైనా అంద‌రూ త‌మ వాద‌న‌లు వినిపించే వీలున్న వేళ‌.. ఆధారాల్లేకుండా చీక‌ట్లో బాణం వేసిన‌ట్లుగా ర‌ఫెల్ ఇష్యూను తీసుకురావ‌టం ద్వారా.. రాహుల్ పెద్ద త‌ప్పే చేశారు.

మోడీపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసే వేళ‌.. మినిమం ఆధారాలు ఉండాల‌న్న విష‌యాన్ని రాహుల్ ప‌ట్టించుకోక‌పోవ‌టంపై సోష‌ల్ మీడియాలో ఆయ‌న ట్రోల్ అవుతున్నారు. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా తన‌పై మోడీకి ద్వేషం ఉంది కానీ త‌న‌కే మాత్రం లేద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు ప్ర‌ధాని ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆయ‌న్ను కౌగిలించుకున్న వేళ ఆయ‌న పెద్ద సాహ‌స‌మే చేశారు.

ఈ చ‌ర్య త‌ర‌చూ త‌న తీరుతో షాకులిచ్చే మోడీ లాంటి నేత‌కు సైతం స‌ర్ ప్రైజ్ గా మారింది. అయితే.. రాహుల్ ప‌నికి కాంగ్రెస్ ప‌క్ష నేత‌లు గ్రాండ్ గా అప్లాజ్ ఇవ్వ‌టంతో రాహుల్ సంతోషంతో మురిసిపోయారు. అక్క‌డే.. ఆయ‌న‌లోని ప‌ప్పు నిద్ర లేచిన‌ట్లున్నాడు. త‌న పార్టీ నేత‌కు క‌న్నుగీట‌టం ద్వారా కెమేరా కంటికి దొరికిపోయారు.

అంతే.. కౌగిలింత వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మారి.. బాలీవుడ్ మెలోడ్రామా ప‌విత్ర‌మైన పార్ల‌మెంటులో చేస్తావా? అంటూ అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న క‌మ‌ల‌నాథులు క‌స్సుమ‌న్నారు.దీంతో.. అవిశ్వాసం మీద చ‌ర్చ కంటే కూడా రాహుల్ కౌగిలింత‌.. క‌న్నుగీటు వ్య‌వ‌హారం మీద‌నే చ‌ర్చ ఎక్కువ జ‌రిగింది. త‌న చ‌ర్య‌తో రాహుల్ ఏపీకి చేసిన అన్యాయం ఏమంటే.. హోదా మీద చ‌ర్చ జ‌ర‌గ‌కుండా చేయ‌ట‌మే కాదు.. విష‌యాన్ని వేరే మార్గంలోకి వెళ్లేలా చేసి.. ఏపీకి ప్ర‌త్యేక హోదా అన్న‌ది చ‌ర్చ‌లోనే లేకుండా చేశార‌ని చెప్పాలి. మొత్తానికి రాహుల్ కౌగిలింత‌..క‌న్నుగీటు వ్య‌వ‌హారం ఏమోకానీ.. ఆంధ్రోళ్ల ప్ర‌త్యేక ఆశ‌లు స‌మాధి అయ్యాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News