కాలం మార్పు తీసుకొస్తుంది. అదే దాని గొప్పతనం. మారే కాలానికి తగ్గట్లు.. ఎప్పటికప్పుడు తనను తాను ఆప్డేట్ చేసుకోని వాడు కాలక్రమంలో కలిసిపోతాడు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే..కాలంతో పాటు కలిసి ప్రయాణించే వీలుంది. అమూల్ బేబీ ఇమేజ్ తో ప్రజల మనసుల్లో నిలిచిన రాహుల్.. తనకున్న పప్పు మార్క్ ను పోగొట్టుకునేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ మధ్యన ఆయన చురుగ్గా వ్యవహరిస్తూ.. తన ప్రత్యర్థి అయిన మోడీపై వార్ ప్రకటించారు. ఏ చిన్న అవకాశం లభించినా.. మోడీపై విరుచుకుపడుతున్నారు. గతానికి భిన్నంగా ఆయన తన ఫైరింగ్ స్టైల్ ను మార్చినట్లుగా కనిపిస్తోంది. సూటిగా కాకుండా.. తెలివిగా వ్యవహరిస్తూ.. మోడీని ఆత్మరక్షణలో పడేసేలా రాహుల్ వ్యాఖ్యలు ఈ మధ్యన ఉంటున్నాయి.
తాజాగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలి. జాతిపిత మహాత్మ గాంధీని చంపింది సంఘ్ పరివార్ అంటూ వ్యాఖ్యలు చేయటం ద్వారా కేసులు ఎదుర్కొంటున్న రాహుల్.. తాను చెప్పిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. కోర్టు కేసుకు హాజరైన ఆయన.. తనపై బీజేపీ.. సంఘ్ పరివార్ లు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు.
రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా ఆసుపత్రిలో వాజ్ పేయ్ ను మొదట పరామర్శించింది తానేనని చెప్పారు. ఇదే కాంగ్రెస్ సంస్కృతిగా అభివర్ణించిన ఆయన మోడీ గురువు అద్వానీ ప్రస్తావన తీసుకొచ్చారు. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి మోడీ కంటే కాంగ్రెస్సే ఎక్కువ గౌరవం ఇచ్చినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అద్వానీ పరిస్థితి చూస్తే తనకు జాలి కలుగుతుందని చెప్పటం ద్వారా.. రాహుల్ తన తీరును మార్చుకోవటమే కాదు.. మోడీపై తాను చేసే పోరాటం తీరును మొత్తంగా మార్చినట్లుగా కనిపించకమానదు.