అప్డేట్ కావ‌టానికి ఆమెరికాకు రాహుల్ టూర్‌

Update: 2017-09-06 06:14 GMT
ప్ర‌జాజీవితంలో ఉన్న వారంతా త‌మ‌కు సంబంధించి ర‌హ‌స్యాలు ఉన్న‌ట్లుగా అస్స‌లు వ్య‌వ‌హ‌రించ‌రు. ఉన్నంత‌లో ఓపెన్ గా ఉన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వారు తాము ఎక్క‌డికి వెళుతున్నా.. ఎవ‌రిని క‌లుస్తున్నా.. ఆ విష‌యాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలియజేస్తుంటారు. ఈ ధోర‌ణికి భిన్నం కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు.. ఆ పార్టీ యువ‌రాజుగా కొలిచే రాహుల్ గాంధీ. త‌న విదేశీ టూర్ల గురించి వివ‌రాలు అంద‌జేసేందుకు.. ప్ర‌జ‌ల‌తో పంచుకునేందుకు రాహుల్ అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.

గుట్టుచ‌ప్పుడు కాకుండా విదేశాల‌కు వెళ్లి వ‌చ్చే ఆయ‌న‌.. ఎక్క‌డికి వెళ్లారు? ఏం చేశారు? ఎవ‌రికి క‌లిశార‌న్న అంశంపై వివ‌రాలు అస్స‌లు బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి.  ఎందుకిలా అంటే ఎవ‌రూ స‌మాధానం చెప్పారు. ఈ మ‌ధ్య‌న రాహుల్ చేసిన నార్వే ప‌ర్య‌ట‌న మిన‌హా.. ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ల వెనుక ఉన్న ఉద్దేశాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌ర‌నే చెప్పాలి. ఈసారి మాత్రం అందుకు భిన్న‌మైన వ్యూహాన్ని రాహుల్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

త‌న తాజా అమెరికా ప‌ర్య‌ట‌న వెనుక ఉన్న ఉద్దేశాన్ని.. ల‌క్ష్యాన్ని ఆయ‌న బ‌య‌ట పెట్టటం గ‌మ‌నార్హం. ఇంత‌కీ రాహుల్ తాజా అమెరికా ప‌ర్య‌ట‌న వెనుక ఉన్న అంశాన్ని చూస్తే ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని చెప్పాలి. ఐటీ రంగంలో త‌ర్వాతి లెవెల్ అయిన ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ పై మ‌రింత అవ‌గాహ‌న కోసం.. ప‌ట్టు కోస‌మే ఆయ‌న అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న‌ట్లు చెబుతున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌. మ‌నుషుల త‌ర‌హాలో ఆలోచించే రోబోలుగా ఈ టెక్నాల‌జీని చెప్పొచ్చు) మీద ప‌రిశోధ‌న‌లుచేస్తున్న ప‌లువురిని క‌ల‌వ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ఈ అంశానికి ఇప్పుడిప్పుడే భార‌త్ లో ప్రాచుర్యం పొందుతుంద‌ని చెప్పాలి. చైనా లాంటి దేశాల్లో ఈ అంశంపై జోరుగా ప‌రిశోధ‌న‌లు సాగుతున్నాయి. ఈ అంశంపై త‌మ పార్టీ డాక్యుమెంట్ లో పేర్కొనాల‌ని భావిస్తున్నారు రాహుల్‌. ఈ నేప‌థ్యంలో త‌న అమెరికా టూర్ లో ఏఐ మీద మ‌రింత ప‌ట్టు పెంచుకోవ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. మ‌రి.. ఆయ‌న టూర్ ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క్ వుట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News