మామూలుగా అయితే భారతీయ జనతా పార్టీ వాల్లు అలా మాట్లాడాలి. అయితే కేరళలో రాహుల్ గాంధీ హైందవ సంప్రదాయాల గురించి మాట్లాడారు. తాము సంప్రదాయాలను కాపాడతామని రాహుల్ ప్రకటించుకున్నారు. అయితే మరీ సూటిగా మాట్లాడలేదు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు.
రాహుల్ మాట్లాడిన టాపిక్ ఏమిటో మాత్రం అందరికీ అర్థమైపోయింది. ఆయన అయ్యప్ప స్వామి దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను ప్రవేశింపజేయడం గురించి మాట్లాడారు. తమకు అధికారం ఇస్తే.. అలాంటి పరిస్థితి ఉండదన్నట్టుగా - తాము సంప్రదాయాలకు విలువను ఇస్తామంటూ రాహుల్ ప్రకటించుకున్నారు.
కేరళ లోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ అక్కడ ప్రచారానికి వెళ్లారు. ఆ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సంప్రదాయాలను కాపాడతాం..’ అనే మాటతో స్థానిక హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు రాహుల్ గాంధీ.
ఒకవైపు అయ్యప్ప దేవాలయం అంశాన్ని బీజేపీ తన అస్త్రంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అయ్యప్ప ప్రస్తావన తెస్తే ఈసీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అందుకే రాహుల్ కూడా ఇన్ డైరెక్టుగా మాట్లాడారు.
మొత్తానికి అయ్యప్ప దేవాలయ సంప్రదాయాల విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ - ఇటు బీజేపీ దాదాపు ఒకే మాటను చెబుతున్నాయి. లెఫ్ట్ పార్టీల కూటమి మాత్రమే సంప్రదాయాలను పట్టించుకునేది లేదంటోంది!