రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి(94)....తీవ్ర అస్వస్థతకు గురవడంతో గత 5 రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. కరుణానిధి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని....వదంతులు వ్యాపించడంతో, ఆయనను చూసేందుకు వీవీఐపీలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా కావేరీ ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ వదంతులను నమ్మవద్దని...కరుణకు చికిత్స అందిస్తున్నామని.....ఆయన పరిస్థితి నిలకడగా ఉందని,....ఆయన త్వరలోనే కోలుకుంటారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. తమ ప్రియతమ నేతకోసం అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తమ నేత ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరుణ అభిమానులు ఊపిరి పీల్చుకునేలా....తాజాగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కరుణానిధిని పరామర్శించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కావేరీ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోలో....బాగా బలహీనంగా కనిపిస్తోన్న కరుణానిధి చెవిలో...స్టాలిన్ ఏదో చెబుతన్నట్లుగా కనిపిస్తోంది. కరుణానిధి బెడ్ దగ్గర రాహుల్ నిలుచొని ఉన్నారు. కరుణానిధిని పరామర్శించి వెళ్లిన తర్వాత రాహుల్ ఓ ట్వీట్ చేశారు. కరుణానిధి చాలా ధృఢమైన వ్యక్తని - ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ట్వీట్ చేశారు. గత 5 రోజుల నుంచి కావేరీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో కరుణానిధికి చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఫొటో....కరుణానిధి అభిమానులకు - డీఎంకే కార్యకర్తలకు ఊరటనిచ్చింది.