గాంధీల కుటుంబం అనగానే గుర్తుకు వచ్చేది మహాత్మా గాంధీ కుటుంబం కాదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబమే. వీరి వారసులుగా రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీలు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. రాజీవ్‌గాంధీ దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అందరికీ తెలుసు. కానీ, వరుణ్ గాంధీ దక్షిణాదికి పెద్దగా తెలియదు. కానీ, ఇద్దరూ కూడా అన్నదమ్ములే. రాజీవ్ గాంధీ కుమారుడు.. రాహుల్ అయితే, సంజయ్ గాంధీ కుమారుడు వరుణ్‌గాంధీ. అయితే.. ఇద్దరూ కూడా వేర్వేరుపార్టీల్లో ఉన్నారు.
రాహుల్ కాంగ్రెస్‌లో ఉంటే, వరుణ్ బీజేపీలో ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య పొలిటికల్ గ్యాప్ ఉంది. అంతేకాదు.. ఇద్దరి మధ్య కుటుంబాల వివాదాలు, విభేదాలు కూడా ఉన్నాయి. ఇదిలావుంటే, వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఇటీవల వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆయనకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో బీజేపీని వదిలిపెట్టి, కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారమవుతోంది. మరోవైపు ఆయన బీజేపీ పరిపాలనలోని వైఫల్యాలను వరుణ్ ఎండగడుతున్నారు. ముఖ్యంగా మోడీ పాలనపై ఆయన చురకలువేస్తున్నారు.
అయితే.. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లోకి రాక గురించి పరోక్షంగా రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ భావజాలం, తన భావజాలం పూర్తిగా విరుద్ధమని రాహుల్ చెప్పారు. తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) కార్యాలయానికి వెళ్లే ప్రసక్తే లేదని, అది జరగాలంటే తన తల తెగిపోవాలని భారీ సంచలన వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు.
‘‘వరుణ్ గాంధీ బీజేపీలో ఉన్నారు. ఆయన ఇక్కడికి(కాంగ్రెస్) వస్తే, ఆయనకు అదొక సమస్య కావచ్చు. ఆయన భావజాలంతో నా భావజాలం సరిపోలదు. నేను ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లను. అది జరగాలంటే అంతకుముందే నా తల తెగిపడాలి. నా కుటుంబానికి ఓ సిద్ధాంతం, భావజాలం ఉన్నాయి. వరుణ్ మరొకదానిని అనుసరిస్తున్నారు. ఆయన అనుసరిస్తున్న సిద్ధాంతాన్ని నేను అంగీకరించలేను’’ అని చెప్పారు. దీంతో ఇప్పటి వరకు వరుణ్ వస్తారని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు డోలాయమానంలో పడ్డారు. అన్నదమ్ముల మధ్య సవాల్ ఇలా మారిందేంటని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.