రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే ... బీజేపీ డిమాండ్ !

Update: 2019-12-13 10:19 GMT
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'రేప్ ఇన్ ఇండియా' కామెంట్లు పార్లమెంట్‌ లో ప్రకంపనలు రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై శుక్రవారం లోక్‌ సభ - రాజ్యసభ దద్దరిల్లాయి. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని మేక్ ఇన్ ఇండియా అని ఎలా అంటారని బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభకు ఆటంకం కలుగడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేసిన.. పరిస్థితి లో మార్పు లేకుండా పోయింది. కామెంట్లపై పలుమార్లు సభలో చర్చ జరగని పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌ సభ ను నిరావధికంగా వాయిదా వేశారు.

దిశ అత్యాచార ఘటన తర్వాత దేశం రేప్‌లకు రాజధాని గా మారి పోయిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై లోక్‌ సభ లో ఎన్డీయే పక్షాలు భగ్గుమన్నాయి. దేశ చరిత్రలో మొదటిసారి ఓ నాయకుడు భారతీయ మహిళలు అత్యాచారానికి గురికావాల్సిందే అంటున్నాడని మండిపడ్డారు. ఇదేనా దేశానికి రాహుల్ ఇచ్చే సందేశం అంటూ ప్రశ్నించారు. రాహుల్‌ ను కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.  ప్రపంచం ముందు భారత్‌ ను మంచి స్థితిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే.. రాహుల్ గాంధీ ఇలా మాట్లాడటం సరికాదంటున్నారు. లైంగిక హింస - తక్కువ చేసి మాట్లాడటాన్ని తప్పుపట్టారు.

రాహుల్ అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ డిమాండ్ చేశారు. మరో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా వంతపాడారు. రేప్ వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీ మహిళలను తక్కువ చేశారని ఆమె విమర్శించారు. సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. కాగా, డిమాండ్‌ పై రాహుల్ గాంధీ స్పందించారు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలను పక్క దారి పట్టించేందుకే బీజేపీ నేతలు ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు.
Tags:    

Similar News