రాహుల్ కు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆ ప్రతిష్ఠాత్మక పురస్కారం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోవద్దు. మహా మహా నటులకే దక్కని ఆ ఛాన్సు రాహుల్ కు వచ్చే ఛాన్సే లేదు. ఈ రాహుల్ ఆ రాహుల్ వేరువేరు. భారత సంతతికి చెందిన నటుడు, నిర్మాత రాహుల్ ఠక్కర్ కు ఈ ఆస్కార్ అవార్డు వచ్చింది.
ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డులు ప్రకటించడానికి ముందు 10 సైంటిఫిక్ - టెక్నికల్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్సు అండ్ సెన్సెస్ ప్రదానం చేయనుంది. ఫిబ్రవరి 13న నిర్వహించనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఈసారి భారత సంతతికి చెందిన నటుడు - నిర్మాత రాహుల్ థక్కర్ అవార్డు అందుకోబోతున్నారు. రాహుల్ కు టెక్నికల్ అచీవ్ మెంట్ విభాగంలో అవార్డు వరించింది. ఈ మేరకు ఆస్కార్ అవార్డుల అధికారిక వెబ్ సైట్ లో ఇప్పటికే జాబితా ప్రకటించారు. 'గ్రౌండ్ బ్రేకింగ్ డిజైన్'లో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు ప్రకటించినట్టు తెలిపింది.