మరికొద్ది రోజుల్లో ప్రవేశ పెట్టే రైల్వే బడ్జెట్ లో ఈసారి షాకుల మీద షాకులు తప్పవా? ఇప్పటివరకూ అమలు అవుతున్న రాయితీల్లో పెద్ద ఎత్తున కోతలు తప్పవా? సీనియర్ సిటిజన్లకు కల్పిస్తున్న రాయితీల్ని అడ్డంగా కోతలు విధించనున్నారా? లాంటి ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. మోడీ సర్కారు వస్తే.. మంచి రోజులు ఖాయమన్న మాట తర్వాత.. ఉన్న సౌకర్యాలు కూడా పోయే పరిస్థితి నెలకొనటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
రైల్వేలకు ఆర్థికభారం పేరిట.. ఇప్పటికే పలు వర్గాలకు కల్పిస్తున్న రాయితీలకు కోత పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి గడిచిన ఏడాది కాలంలోరైల్వేలకు సంబంధించి పలు అంశాల్లో ఆర్థిక భారాన్ని మోపుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో బడ్జెట్ సమయంలో లేదంటే కొన్న ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రయాణికుల మీద భారం మోపేలా నిర్ణయాలు తీసుకునే వారు.
ఇలాంటి నిర్ణయాలపైనా నాటి విపక్ష బీజేపీ గట్టిగా వ్యతిరేకించేది. కానీ.. ఇప్పుడు అధికారపక్షంగా ఉన్న బీజేపీ.. ప్రయాణికులకు మేలు కంటే కూడా మోత పుట్టించే నిర్ణయాలు తరచూ తీసుకొంటోంది. ఈసారి రైల్వే బడ్జెట్ లో ఈ తరహా కోతలు భారీగా ఉంటాయని చెబుతున్నారు. అలాంటి కోతల వాతల విషయానికి వస్తే..
= 60 ఏళ్లకు పైబడిన పురుషులు.. 58 ఏళ్లకు పైబడిన మహిళలకు అందిస్తున్న రాయితీల్లో కోత
= పురుషులకు 40శాతం.. మహిళలకు 50 శాతం టిక్కెట్టుధరలో రాయితీ ఇస్తుంటే.. ఇప్పుడు దాన్ని 25 శాతానికి కుదించాలని భావిస్తున్నారు
= మాజీ ఎంపీలకు ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం రద్దు
= రైల్వే అధికారులకు ఇచ్చే ఉచిత పాసులపై నియంత్రణ
= 60 - 65 సంవత్సరాల వారికి రాయితీలో కోత పెట్టి అంతకంటే పెద్ద వయస్కులకు రాయితీ
= ఇప్పుడు అమలు చేస్తున్న ఉచిత.. రాయితీ ప్రయాణాలపై వీలైనంత ఎక్కువగా కోతల వాతలు
= స్వాతంత్ర్య సమరయోధులు.. క్రీడాకారులు.. అవార్డుగ్రహీతలకు ఇచ్చే రాయితీల రద్దు
= ప్రయాణికులకు ఆహార పదారథాల సరఫరా బాధ్యతను రైల్వేల నుంచి ఐఆర్సీటీసీకి అప్పగింత