కరోనా పేరుతో ప్రయాణికులను బాదేసిన రైల్వేశాఖ

Update: 2021-04-13 06:30 GMT
కరోనా కేసుల పేరుతో రైల్వేశాఖ ప్రయాణికులను బాదేసింది. దక్షిణ మధ్య రైల్వే మరోసారి ప్రయాణికులకు షాకిచ్చింది. ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరలను రూ.30 నుంచి రూ.50కి పెంచుతున్నామని బాంబు పేల్చింది.

రైలు ఎక్కేవారు మినహా మిగతా వారెవరూ స్టేషన్ కు రాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ చెబుతున్నా ఈ నిర్ణయంపై ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫాం టికెట్ ధరలను రూ.50కి పెంచడంపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయనే నెపంతో దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనాతో నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ ఆదుకోవాల్సిది పోయి భారం వేస్తున్నారని వాపోతున్నారు.

అటు రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. నేటి నుంచి పెంచిన ధరలు అమలు అవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
Tags:    

Similar News