చిరుత పులి వేగంతో దూసుకువెళ్లే రైళ్లు వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నాయి. ఎంపిక చేసిన రూట్లలో గంటకు 160 నుంచి 200 కి.మీ.ల వేగంతో దూసుకెళ్లేందుకు ఇవి రెడీ అవుతున్నాయి. కేవలం వేగమే కాదు ఆ రైళ్లను చూడగానే చిరుత పులి గుర్తొచ్చేలా రంగులేస్తారట. ఇందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ భారతీయ రైల్వేకు తోడ్పాటును అందించింది. బోగీలకు బూడిదరంగు - నలుపునీలం రంగులు వేసి - అంచులకు పసుపు మయం చేస్తారు. ప్రధాన నగరాల మధ్య హై స్పీడు రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణ సమయం తగ్గించడం భారతీయ రైల్వే ప్రధాన ఉద్దేశ్యం. జపాన్ తో బుల్లెట్ ట్రైన్ కోసం ఒప్పందం ఇప్పటికే కుదరగా అంతకుముందే ఈ ఇండియన్ చిరుతలు పట్టాలెక్కబోతున్నాయి.
చిరుత పులిని పోలిన రంగులతో కూడి న కొత్త బోగీలు ఈ ఏడాది మార్చినాటికి సిద్ధమవుతుంది. ఢిల్లి-ఆగ్రా - ఢిల్లి-కాన్పూరు - చెన్నయ్-హైదరాబాద్ - నాగ్ పూర్- సికింద్రాబాద్ - ముంబై-గోవా రూట్లలో ఈ చిరుతలు పరుగులు తీయనున్నాయి. బుల్లెట్ రైళ్లు గంటకు 250 నుంచి 350 కి.మీ.ల వేగంతో దూసుకుపోతాయి... ఈ చిరుత రైళ్లు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. మొత్తానికి ఇక పట్టాలపై చిరుతపులుల పరుగులు చూడబోతున్నామన్నమాట.