ఆ టికెట్స్ అన్నీ రద్దు ... రైల్వేశాఖ తాజా సర్క్యులర్‌!

Update: 2020-06-24 09:50 GMT
ఓ కంటికి కనిపించని వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఈ వైరస్ కారణంగా రవాణా రంగం దారుణంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా మనదేశంలో దాదాపుగా రెండు నెలలకి పైగా ఏ ప్రజారవాణా వాహనం కూడా రోడ్డుపైకి రాలేదు. ఈ మద్యే బస్సులు ప్రారంభం అయ్యాయి. అయితే , అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇవ్వడంలేదు. కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. కఠిన నియమ నిబంధనల మధ్య దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కూడా కేంద్రం రైల్వే సర్వీసులకు అనుమతివ్వడం లేదు. ఈ క్రమంలో ఆగస్టు మధ్య వరకు కూడా రైల్వే సేవలను పునరుద్ధరించబోవడం లేదనేది తాజా సమాచారం. గతంలో జూన్ 30 వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ నుండి ఆ తర్వాత రైళ్లలో ప్రయాణం చేసేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన వారుకు శుభవార్త చెప్పారు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రయాణీకులకు సంబంధిత టిక్కెట్లను రద్దు చేశామని, అలాగే ఆ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాలని నిర్ణయించినట్లు గోయల్ తెలిపారు. ఏప్రిల్ 14న లేదా అంతకు ముందు వరకు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లను రద్దు చేయాలని.. ప్రయాణికులకు పూర్తి సొమ్మును వాపసు‌ చేయాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం అన్ని జోన్లకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం రైల్వే శాఖ రోజు 230 మెయిల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. అయితే వైరస్ నేపథ్యంలో సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎక్కువ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం, యాత్రికుల కోసం, విద్యార్థులు తదితరుల కోసం రైల్వేలు మే 1వ తేదీ నుండి శ్రామిస్ స్పెషల్ రైళ్లను ప్రవేశ పెట్టాయి.రైల్వే శాఖ మే 12వ తేదీ నుండి 30 ప్రత్యేక ఏసీ రైళ్లను ప్రారంభించింది. జూన్ 1వ తేదీ నుండి మరో 200 టైమ్ టేబుల్డ్ రైళ్లను ప్రారంభించింది.
Tags:    

Similar News