ఏసీ బోగీల్లో ఇకపై వాటిని ఇవ్వరంతే.. ఎందుకంటే?

Update: 2020-03-15 04:37 GMT
కలకలం రేపుతున్న కరోనా నేపథ్యంలో ఎవరికి వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం షురూ చేశారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటనను జారీ చేసింది. రైళ్లల్లో ప్రయాణించే సమయంలో ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి మందపాటి బ్లాంకెట్లు ఇస్తుంటారు. దాంతో పాటు.. రెండు దుప్పట్లు.. దిండ్లు.. దిండు కవరు ఇస్తుంటారు. కరోనా నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండేందుకు బ్లాంకెట్లను ఇవ్వటం ఆపేస్తారు.

ఈ విధానాన్ని ఏప్రిల్ 15 వరకు కొనసాగిస్తామని దక్షిణ మధ్య రైల్వే చెబుతోంది. ఎవరైనా ప్రయాణికులు తమకు తప్పనిసరిగా బ్లాంకెట్ ఇవ్వాలని కోరితే.. వారికి మాత్రమే అందిస్తారు. దుప్పట్లు.. దిండు.. దిండు కవరును మాత్రం ఎప్పటిలానే యథావిధిగా అందిస్తారు. కరోనా నేపథ్యంలో ఏసీ బోగీల్లో ఉష్ణోగ్రతల్ని 23-25 డిగ్రీలకు పెంచనున్నారు. ఇప్పటివరకూ ఉన్నట్లుగా చలిని కాస్త తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పాటుగా.. రైళ్లల్లో సీట్లతో పాటు మెట్ల రైలింగ్ లు.. కిటికీల దగ్గర పలు వైరస్ లను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లుగా ప్రకటించింది. ప్రధాన రైల్వే స్టేషన్ల ఫ్లాట్ ఫారాల్లోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు పేర్కొంది.
Tags:    

Similar News