సెమీస్ ఆడ‌కుండానే ఇంగ్లండ్ ఇంటికే...

Update: 2019-07-08 08:06 GMT
ప్రపంచకప్ క్రికెట్ టోర్న‌మెంట్ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ప్ర‌పంచ‌క‌ప్ విజేత ఎవ‌రో మ‌రో మూడు మ్యాచ్‌ ల‌లో తేలిపోనుంది. అయితే గురువారం ఎడ్జ్‌ బాస్ట‌న్‌ లో జ‌రిగే రెండో సెమీఫైన‌ల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జ‌ట్టును డిపెండింగ్ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియా ఢీకొడుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌ లో వ‌రుణ‌దేవుడు ఇంగ్లండ్ కొంప‌ముంచేలా ఉన్నాడు. వానదేవుడు ఇంగ్లాండును ఓడించే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

మ్యాచ్ జ‌రిగే గురువారం ఎడ్జ్‌ బాస్ట‌న్‌ లో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. అయితే తొలి రోజు మ్యాచ్ ర‌ద్ద‌యితే రెండో రోజు రిజ‌ర్వ్‌ డే నాడు కూడా మ్యాజ్ నిర్వ‌హిస్తారు. అయితే ఇంగ్లండ్ దుర‌దృష్ట‌మో ఏమోగాని రిజర్వ్‌ డే నాడు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయ‌ట‌. ఈ రెండు రోజుల్లో క‌నీసం ఇరు జుట్లు 20 ఓవ‌ర్లు మ్యాచ్ ఆడేలా వ‌రుణుడు తెరిపి ఇస్తేనే ఫ‌లితం తేలుతుంది.

40 ఓవ‌ర్లు కూడా మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోతే  ఇంగ్లండ్ సెమీస్ ఆడ‌కుండానే ఇంటికి వెళ్లిపోతుంది. ఎందుకంటే ప్ర‌పంచ‌క‌ప్ నిబంధ‌న‌ల ప్ర‌కారం రెండు రోజులు కూడా మ్యాచ్‌ రద్దయితే లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌ కన్నా ఎక్కువ పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్‌ కు చేరుతుంది. నాకౌట్ ద‌శ‌లో మ్యాచ్‌ లు ర‌ద్ద‌యితే లీగ్ ద‌శ‌లో ఎక్కువ విజ‌యాలు సాధించిన జ‌ట్టే ఫైన‌ల్‌ కు వెళుతుంద‌ని ప్ర‌పంచ‌క‌ప్ నిబంధ‌న‌లు ఉన్నాయి.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే మంగ‌ళ‌వారం జ‌రిగే తొలిసెమీఫైనల్‌ కు కూడా వ‌రుణుడి గండం ఉంద‌ట‌. ఈ మ్యాచ్‌ లో కూడా రెండు రోజులు ఫ‌లితం రాక‌పోతే ఇండియా ఫైన‌ల్‌ కు, న్యూజిలాండ్ ఇంటికి వెళ‌తాయి. ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచులకు వర్షం తాకిడి తప్పలేదు.
 
    
    
    

Tags:    

Similar News