గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తోన్న ఆ తరుణంరానే వచ్చింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన బద్వేల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అకాలమరణం తో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనితో అప్పటి నుండి ఈ ఉప ఎన్నికపై భారీగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఎట్టకేలకి ఎన్నికల నోటిఫికేషన్ రావడం , ప్రచారంలో కీలక నేతలు మునిగితేలడం వంటివి ముగిశాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం , జనసేన పోటీలో లేకపోయినప్పటి బీజేపీ రేసులో నిలవడం తో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే దాదాపుగా ఏకగ్రీవం అయ్యేది. అయితే టీడీపీ , జనసేన పోటీలో లేనప్పటికీ బీజేపీ కి లోపల మద్దతు తెలుపుతున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి .
ఇక ఇదిలా ఉంటే రేపు ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో కడప జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ఎఫెక్ట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పడింది. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్దకు పీవోలు, ఏపీవోలు, పీపీవోలు చేరుకున్నారు. అయితే, సామాగ్రి పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. అయితే వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కురుస్తుండటంతో ఎలక్షన్ సామాగ్రిని పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. షామియానాలు పూర్తిగా తడిసిపోయాయి. మరోవైపు వర్షం కారణంగా సామాగ్రి పంపిణీ కేంద్రంలోకి సిబ్బంది రాలేకపోతున్నారు.
కాగా, బద్వేల్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు చూసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి తడవకుండా జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించే ఏర్పాట్లు చేయాలనీ వ్యూహాలు రచిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నికకు రేపు పోలింగ్ ఉండగా, వర్షం కారణంగా పోలింగ్ సిబ్బందికి వెయ్యి గొడుగులు, ఏడు వేల రేయిన్ కోట్ల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో తమ అభ్యర్థిగా రాజశేఖర్ ను బరిలోకి దింపింది టీడీపీ. ఇక 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ లోకి జంప్ అయిన జయరాములు ఎన్నికల ముందు బీజేపీలో చేరి పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున కమలమ్మ బరిలోకి దిగారు. అయితే వీరందరిని కాదని ప్రజలు వెంకట సుబ్బయ్యకే పట్టం కట్టారు. వైసీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన 44వేల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ రెండో స్థానంలో నిలిచారు. అయితే , అయన మరణించడం తో మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.