నవ్యాంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు నిద్రాహారాలు మాని కష్టపడుతున్నానంటూ ఏపీ సీఎం చంద్రబాబు అరిగిపోయిన రికార్డును ఎక్కడపడితే అక్కడ ప్లే చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పుల్లో...దానికి తోడు తిప్పల్లో ఉన్న ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని చేస్తానని.....అందుకోసం తాను ముప్పుతిప్పలు పడుతున్నానని బాబుగారు పలు సందర్భాల్లో నొక్కి వక్కాణించారు. అయితే, రాజధాని సంగతి పక్కన పెడితే....సచివాలయం సంగతే సరిగ్గా లేదని గత ఏడాది రుజువైన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ లో సచివాలయంలో సాక్ష్యాత్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చాంబర్ లో భారీగా వర్షపు నీరు చేరడంతో బాబుగారి డొల్లతనం మొదటిసారి బయటపడింది. బాబుగారి మాటలు `వర్షపు`నీటి మూటలని తాజాగా మరోసారి రుజువైంది. తాజాగా, మంగళవారం నాడు జగన్ చాంబర్ లో మరోసారి వర్షపు నీరు లీకేజీ కావడం చంద్రబాబు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
మంగళవారం సచివాలయం పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో, సచివాలయం ప్రాంగణం ఓ మినీ చెరువును తలపిస్తోంది. దాంతో పాటు సచివాలయం గేట్-2 వెయిటింగ్ హాల్ దగ్గర కూడా వర్షపు నీరు లీక్ అవుతోంది. ముఖ్యంగా గత ఏడాది మాదిరిగానే ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్‌లో నీరు యథా ప్రకారం లీక్ అవడం గమనార్హం. గత ఏడాది కూడా ఈ తరహాలో వర్షపు నీరు చేరడంతో వైసీపీ నిరసన చేపట్టింది. పైపులను కోసేశారంటూ స్పీకర్ ఆదేశించిన విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. తాజాగా, మళ్లీ పాత సీన్ రిపీటవడంతో కోట్లు ఖర్చుపెట్టి వెలగపూడిలో నిర్మించిన ఏపీ సచివాలయ డొల్లతనం మరోసారి బయటపడినట్లయింది. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గప్పాలు కొట్టే చంద్రబాబు....చిన్నపాటి లీకేజీని కూడా అరికట్టలేకపోయారు. చిన్నపాటి వర్షానికే ఈ పరిస్థితి ఉంటే....ఇక భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏమిటో అని పలువురు సచివాలయ ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడిపండు చూడ మేలిమై ఉండు అన్న తరహాలో బాబుగారు గొప్పలు చెప్పుకుంటున్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒక్కరోజు సభకు దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టడానికి బదులుగా ....ఇటువంటి మరమ్మతులు చేయించవచ్చని హితవు పలుకుతున్నారు. కావాలనే జగన్ చాంబర్ లో మరమ్మతులు చేయించలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంగీ బాబుగారి పాలన అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు.