ఏదైనా అంశం మీద దేశ ప్రజలు ఎవరైనా కావొచ్చు తమ గళాన్ని వినిపించొచ్చు. తమకున్న అభ్యంతరాల్ని తెర మీదకు తేవొచ్చు. ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పు పట్టొచ్చు. వారి తీరుకు నిరసనగా ఆందోనలు నిర్వహించొచ్చు. ఆ సందర్భంగా ప్రభుత్వ తీరును దునుమాడొచ్చు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సహజంగా ఉండేవే. అలా అని.. స్వేచ్ఛ ఉంది కదా? అని.. ఒక దేశంలో ఉండి మరో దేశానికి అనుకూలంగా నినాదాలు చేయటాన్ని ఏమనాలి?
భారత్ లో ఉంటూ.. భారతదేశ పౌరులమని చెప్పుకునే కొందరు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న కోపంతో కావొచ్చు.. మరేదైనా కారణంగా కావొచ్చు.. పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేయటాన్ని ఏమనాలి? విన్నంతనే ఒళ్లు మండిపోయే ఈ ఉదంతంలో ఒక పోలీసు అధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పాక్ కు మద్దతుగా నినాదాలు చేసే వారిని పాకిస్థాన్ కు వెళ్లిపోవాల్సిందిగా కోరటం తప్పు అవుతుందా? అన్నది ప్రశ్న.
లక్ష్మణ గీతను దాటిన వారి పట్ల కమిట్ మెంట్ ఉన్న ఒక పోలీసు అధికారికి ఒళ్లుమండితే అదేదో పెద్ద తప్పు అయినట్లు.. చేయకూడని నేరం చేసినట్లుగా కొందరు ప్రచారం చేయటాన్ని చూస్తే షాక్ తినాల్సిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారు ఉన్నట్లే.. మద్దతు పలికే వారూ ఉన్నారు. అయితే.. వ్యతిరేకించే వారు కేంద్రం తీరును తప్పు పట్టాలి.. వారి చర్యపై నిరసన వ్యక్తం చేయటం తప్పేం కాదు.
కానీ.. ఆ పేరుతో పాకిస్థాన్ కు అనుకూలంగా.. మద్దతు పలికేలా నినాదాలు చేయటం సబబు కాదు. తాజాగా మీరట్ లో నిర్వహించిన ఆందోళనలో ఒక పోలీసు అధికారి వ్యవహారశైలిని కొందరు తప్ప పడుతున్నారు. కానీ.. ఈ అంశంలోకి తరచి చూస్తే.. దాయాది దేశానికి మద్దతు పలికేలా నినాదాలు చేయటాన్ని ఏమనాలి? పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన నిర్వహిస్తున్న ఆందోళనకారులు పాక్ కు మద్దతుగా నినాదాలు చేస్తున్న వైనాన్ని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు తెలిపే వారు ఆ దేశానికి వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక పోలీసు అధికారి ఇలా ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించేవారు.. భారత్ లో ఉంటే పాక్ కు మద్దతు పలుకుతూ నినాదాలు చేసే వారిని ఏం చేయాలనే అంశం మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.