బ్లూఫిలింల‌తో మోడీ బ్యాచ్ గెల‌వాల‌నుకుంటోందా?

Update: 2017-11-20 05:00 GMT
రాముడ్ని న‌మ్ముకున్న పార్టీని ఎంత మాట అంటారు. మీ పాపం పండింది.. మీకు రామ ఆగ్ర‌హం కల‌గ‌టం ఖాయ‌మ‌ని తిట్టిపోయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. ఇలాంటి వ్యాఖ్య‌లు మేమెందుకు చేస్తాం. ఈ చిత్ర‌మైన వ్యాఖ్య వ‌చ్చింది ఎవ‌రి నోటి నుంచే కాదు.. రాముడ్ని.. హిందుత్వాన్ని విప‌రీతంగా న‌మ్మి.. భ‌విష్య‌త్ మీద బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్న   మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే నోటి నుంచి వ‌చ్చాయి.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ మోడీకి అండ‌గా నిలిచిన చాలామంది త‌ర్వాతి కాలంలో ఆయ‌న తీరుపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి వ‌చ్చి చేరారు రాజ్ ఠాక్రే. మోడీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేత‌ల్లో ముఖ్యుడైన రాజ్ ఠాక్రే.. తాజాగా జ‌రుగుతున్న గుజ‌రాత్ ఎన్నిక‌ల అంశంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

గుజ‌రాత్ ఎన్నిక‌ల వేళ‌లో బీజేపీకి ఇబ్బందిక‌రంగా మారిన ప‌టేల్ ఉద్య‌మ నేత హార్దిక్ ప‌టేల్ కు సంబంధించిన‌విగా చెబుతున్న సెక్స్ సీడీల‌ను విడుద‌ల చేయ‌టం తెలిసిందే. ఈ సీడీల్లో ఉన్న‌ది తాను కాద‌ని హార్దిక్ ప‌టేల్ స్ప‌ష్టం చేశారు. హార్దిక్‌ కు సంబంధించిన వీడియోల‌ను రిలీజ్ చేయ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. తాజాగా రాజ్ ఠాక్రే సైతం ఇదే త‌ర‌హాలో స్పందించారు.

అభివృద్ధి చేస్తామంటూ 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ బ్లూ ప్రింట్ ఇచ్చింద‌ని. కానీ మూడేళ్ల‌లో అభివృద్ది అన్న‌ది జ‌ర‌గ‌లేద‌న్నారు. తాజాగా గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు బ్లూఫిలింలు చూపించి గెల‌వాల‌ని భావిస్తోందంటూ తీవ్ర‌స్థాయి లో ఆరోపించారు. మ‌రొక‌రి బెడ్రూంలోకి మీరు ఎందుకు తొంగి చూస్తారంటూ బీజేపీని ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. బీజేపీని తిట్టిన‌ట్లుగా ఉన్న ఈ వ్యాఖ్య‌లు.. హార్దిక్ ప‌టేల్ ను ఎంతోకొంత ఇరుకున ప‌డేసేలా ఉన్నాయి క‌దూ?
Tags:    

Similar News