తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: గండ్ర, రాజాసింగ్‌ కౌంటర్స్‌

Update: 2019-01-20 10:42 GMT
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజూ వాడీవేడిగా సాగాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ ప్రవేశపెట్టారు. అనంతరం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎల్పీ లీడర్‌ గా భట్టి విక్రమార్కను స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సీఎల్పీ లీడర్‌ గా ఎన్నికైన తర్వాత భట్టి విక్రమార్కను కేసీఆర్‌ అభినందించారు.  

కేసీఆర్‌ ప్రసంగం పూర్తైన తర్వాత కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం అనుకున్న సమయం కంటే ముందే రద్దు అయ్యిందని.. అందువల్ల అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 40 రోజులైనా మంత్రులు కూడా ఎవ్వరూ లేరని విరమ్శించారు. మరికొన్నిరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మళ్లీ ఎన్నికల కోడ్‌ ని సాకుగా చూపిస్తారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా.. మీ గవర్నర్‌ అంటూ అన్నారు గండ్ర. అయితే.. గండ్ర కామెంట్‌పై కేసీఆర్‌ అబ్యంతరం వ్యక్తం చేశారు. మీ గవర్నర్‌ కాదు మన గవర్నర్‌ అని అనాలని చెప్పారు. గవర్నర్‌ ప్రసంగంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అని వచ్చిందని.. అందుకే అలా మాట్లాడానని గుర్తుచేశారు. టీఆర్‌ ఎస్‌ అనే పదం వినడానికి కూడా కాంగ్రెస్‌ వాళ్ళకు సహించడం లేదని.. అందుకే అప్పుడే విమర్శలు కూడా మొదలుపెట్టారని కేసీఆర్‌ అన్నారు.

మజ్లీస్‌ పార్టీని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ముకాసే కొన్ని పార్టీలు ఉన్నాయని.. అలాంటి వారితో సీఎం కాస్త జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అవసరం అయితే.. వాళ్లు కాళ్లు కూడా లాగేస్తారంటూ మజ్లీస్‌ని ఉద్దేశించి కామెంట్స్‌ చేశారు రాజా సింగ్‌. ఉస్మానియా హెరిటేజ్‌ బిల్డింగ్ కూల్చేసి కొత్తగా కట్టాలని ఈ సందర్భంగా రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు.


Full View
Tags:    

Similar News